కదల్లేని పరిస్ధితిలో..హాస్పిటల్ బెడ్ పై కీరవాణి.. అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..!?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన మ్యూజిక్ తో అభిమానుల్ని అలరించిన ఎంఎం కీరవాణి ..రీసెంట్గా ఆర్ ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే సరికొత్త చరిత్రను సృష్టించాడు.

ప్రమోషన్స్ లో భాగంగా అమెరికా వ్యాప్తంగా ఓ రేంజ్ లో హంగామా చేసిన ఎంఎం కీరవాణికి సంబంధించిన లేటెస్ట్ గా పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎం ఎం కీరవాణి ప్రజెంట్ హాస్పిటల్ బెడ్ పై కదలని పొజిషన్లో ఉన్నాడు అంటూ న్యూస్ హల్ చల్ చేస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఎం ఎం కీరవాణికి కరోనా పాజిటివ్గా తెలుస్తుంది .

ఈ క్రమంలోని ఆరోగ్యం క్షీణించడంతో.. ఆయన హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటున్నట్లు ఓ న్యూస్ సినీ వర్గాలలో వైరల్ గా మారింది . అంతేకాదు ఆయన హాస్పిటల్ బెడ్ పై ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఓ పిక్ కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎంఎం కీరవాణి అఫీషియల్ గా తెలుగు మీడియాలో స్పందించలేదు. కొన్ని రోజుల ముందు హిందీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ..తన హెల్త్ బాగోలేదని కరోనా టెస్ట్ చేయించుకోబోతున్నానని.. ఒకవేళ పాజిటివ్ వస్తే హాస్పిటల్ అడ్మిట్ అవుతానని చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . రీసెంట్ గా పిక్ చూసిన కీరవాణి అభిమానులు బాధపడిపోతున్నారు . ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు . ఇది నిజంగా కీరవాణి అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ అంటూ ఫీల్ అయిపోతున్నారు..!!