ఎన్టీఆర్ కోసం అలాంటి పని చేస్తున్న జాన్వీ.. నిజమైన అభిమానం అంటే ఇదేగా..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాల పై అభిమానుల్లో హ్యూజ్ ఎక్స్ పెక్ టేషన్స్ ఉన్నాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో మనకు తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ అందజేశాడు కొరటాల శివ . ఈరోజు ఎన్టీఆర్ 30 షెడ్యూల్ ప్రారంభించారు.

హైదరాబాద్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు . హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అక్కడ ఏర్పాటు చేసిన భారీ షిప్ సెట్ లో ఈ షూటింగ్ కొనసాగుతుంది అంటూ ఓ న్యూస్ లిక్ అయింది . ఈ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న జాన్వి కపూర్ కూడా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ సినిమా కోసం జాన్వి కపూర్ నాచురాలిటీ లుక్స్ కోసం చాలా ట్రై చేస్తుందట.

మరీ ముఖ్యంగా రంగస్థలం సినిమాలో సమంత . దసరా సినిమాలో కీర్తి సురేష్ ..నటించిన విధంగా తాను కూడా నేచురాలిటీగా ఉండే విధంగానే ఈ సినిమా కోసం జాన్వి చాలా కష్టపడుతుందట . ఈ సినిమాలో జాన్వి నిజంగానే పేడ కలిపి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టే విధంగా కొరటాల శివ క్యారెక్టర్ డిజైన్ చేశారట . దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకొని మరి ఆ నేచురల్టీ లుక్స్ ను తెరపై అంతే నాచురల్ గా కనిపించే విధంగా జాన్వికపూర్ ట్రై చేస్తుందట. నిజానికి ఈ సీన్స్ అన్ని డూప్ పెట్టి తీద్దామనుకున్నారని .. కానీ జాన్వి ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతో నేనే ఒరిజినల్ గా నటిస్తాను అని చెప్పుకొచ్చిందట . దీంతో ఎన్టీఆర్ అంటే జాన్వీకి ఎంత ఇష్టమో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే కచ్చితంగా ఎన్టీఆర్ 30 సినిమా బాక్సాఫీస్ రికార్డును తిరగరాస్తుంది అంటున్నారు జనాలు..!!