ఇంట్రెస్టింగ్ అప్డేట్: బాలయ్య- అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్‌కు టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరోలైన బాలయ్య, చిరంజీవి తమ సినిమాలతో పోటీ పడగా ఇందులో ఇద్దరు విజయం సాధించారు. ఆ తర్వాత సమ్మర్‌లో కూడా వరుస‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో భాగంగా అందరికంటే ముందుగా యువ హీరో నాని దసరా సినిమాతో తన సమ్మర్ వేటను మొదలుపెట్టాడు. ఆ తర్వాత రవితేజ మరికొందరు యువ హీరోలు ఈ సమ్మర్ పోటీలో నిలవనున్నారు.

ఆ తర్వాత వచ్చే వినాయక చవితి, దసరాకు కూడా ఇప్పటినుంచే గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే ఆ సమయంలో వచ్చే సినిమాల విడుదల తేదీల‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. ఇక‌ ఇప్పుడు అదే సమయంలో బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న NBK 108 కూడా దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుందని తెలుస్తోంది.

 

ఈ సినిమాను అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది చిత్ర యూనిట్. 21 శనివారం కావడంతో ఆ తర్వాత రోజు నుంచి అన్ని వరుస పండుగ సెలవులే. అందువల్ల ఈ సినిమాకు పోటీగా విడుదలయ్యే సినిమాల వల్ల పెద్ద సమస్య కాదని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్, మరియు శ్రీ లీల, జగపతిబాబు బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.

థ‌మన్ సంగీతం అందించగా సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే ఇదే దసరాకు మరో ఒకటి రెండు సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. అందువల్ల మొత్తం మీద దసరా సీజన్‌కు కాస్త గటి పోటీ వుండే అవకాశం కనిపిస్తోంది.

Share post:

Latest