సోషల్ మీడియాలో మెగా వారసుడి న్యూస్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కన్నా పుట్టబోయే మెగా వారసుడు పేరునే ఎక్కువగా జపిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ క్రమంలోనే రీసెంట్గా గుడ్ మార్నింగ్ అమెరికా షో కి అటెండ్ అయిన రామ్ చరణ్ ని అమెరికా డాక్టర్ జెనీఫర్ ప్రత్యేక కోరిక కోరింది . “మీ భార్య ఉపాసన డెలివరీ నేను చేస్తాను “అంటూ ఓపెన్గానే లైవ్ లో ఇరుకున పెట్టేసింది . దీనికి చరణ్ కూడా అంగీకారం తెలిపారు.
అయితే ఈ క్రమంలోనే మెగా వారసుడు అమెరికాలో పుట్టబోతున్నాడు అంటూ మెగా ఫాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే అలాంటి వాళ్లకు మెగా కోడలు ఉపాసన గుడ్ న్యూస్ అందించింది . “మా మొదటి బిడ్డ ఇండియాలోనే పుట్టబోతున్నాడు.. అంతర్జాతీయ స్టాండర్డ్స్ వైద్యులు ఇప్పుడు అపోలో ఆసుపత్రిలోనే ఉన్నారు. మరో గైనకాలజిస్ట్ కూడా జాయిన్ అవ్వబోతున్నారని ..డాక్టర్ జెనీఫర్ని ట్Yఆగ్ చేసి మరి ఉపాసన చెప్పకు వచ్చింది “.
ఈ క్రమంలోనే జెనిఫర్ కూడా రియాక్ట్ అయింది . “అందుకు అంగీకారం తెలిపింది”. ఈ క్రమంలోనే ఉపాసన డెలివరీ అపోలో హాస్పిటల్ లో జరగబోతుంది.. అందులో అమెరికా డాక్టర్ జెనీఫర్ సైతం భాగం కానున్నట్లు ఉపాసన ఓపెన్ గానే చెప్పేసింది . ఈ క్రమంలోన ఉపాసన-చరణ్ బిడ్డ ఇండియాలోనే పుట్టబోతున్నాడని ..మెగా ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రెసెంట్ రాంచరణ్ అమెరికాలో ఉన్నారు . ఆయన హీరోగా నటించిన RRR సినిమా లోని నాటునాటు పాట ఆస్కార్ నామినేషన్ లిస్టులో ఉంది . ఈ క్రమంలోనే అక్కడ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ టీం…!!
Dr Jen Ashton, ur too sweet. Waiting to meet you. Pls join our @HospitalsApollo family in India along with Dr Sumana Manohar & Dr Rooma Sinha to deliver our baby 🤗❤️
A big shout out to all the viewers of @ABCGMA3 & @AlwaysRamCharan ‘s fans & well wishers. U are much loved https://t.co/byeGqOllsK
— Upasana Konidela (@upasanakonidela) February 25, 2023