చరణ్ కి ఇష్టం లేకపోయిన తండ్రి కోసం చేసిన సినిమా ఇదే.. రిజల్ట్ చూసి ఏడ్చేసిన సురేఖ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా మెగా పవర్ స్టార్ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ ఊహలు ఎక్కువగా ఉంటాయి . ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అని తెలియగానే చిరుత సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు . ఎవరు ఊహించిన విధంగా రామ్ చరణ్ ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు .

పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిరుత సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ దక్కించుకుంది. ఫస్ట్ సినిమాతోనే ఇలాంటి క్రేజ్ సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ నటించి మెప్పించాడు చరణ్. ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలో నటిస్తున్న చరణ్ తన కెరియర్ లో ఒక్క సినిమా మాత్రం అసలు నచ్చకుండానే చేశాడట . అది కూడా తన నాన్న చిరంజీవి కోసం బలవంతంగా మొక్కుబడిగా ఆ సినిమాకు సైన్ చేశారట ,

షూటింగ్లోనూ ఇబ్బందికరంగానే నటించాడట . కానీ సినిమా రిజ్ల్ట్ చూసి మాత్రం షాక్ అయిపోయాడట . ఆ సినిమా మరేదో కాదు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కృష్ణవంశీ తెరకెక్కించిన గోవిందుడు అందరివాడేలే సినిమా. ఈ సినిమా కథ విన్నప్పుడు చరణ్ కి స్టోరీ నచ్చలేదట. కానీ చిరంజీవి కథవిని ఫ్యామిలీ ఆడియోస్ కి దగ్గరవచ్చు అంటూ పట్టుబడి ఒప్పించి సినిమాకి సైన్ చేయించారట .

కాగాసినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా చూసి సురేఖ థియేటర్లోనే ఏడ్చేసిందట . అంతలా తన కొడుకు పెర్ఫార్మెన్స్ బాగుందని.. ప్రతి అమ్మకు ఆ సినిమా కనెక్ట్ అవుతుందని సురేఖ హగ్ చేసుకుని మరి రాంచరణ్ తో ఎమోషనల్ గా మాట్లాడిందట. ఆ కామెంట్స్ ఇప్పటికీ మర్చిపోలేను అంటూ చరణ్ నే స్వయంగా చెప్పుకోరావడం గమనార్హం. ఇలా ఇష్టం లేకుండానే నాన్న సలహాతో మంచి హిట్ అందుకున్నాడు చరణ్..!!

Share post:

Latest