పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్‌… అదిరిపోయే ట్విస్ట్ ఇదే..!

పాన్ ఇండియా సినిమాలు అనగానే సింగిల్ హీరో ఉండాల్సిన పనిలేదు. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన హంగామా అంతా ఇంత కాదు.. ఏకంగా ఈ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఇక దీంతో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మిగిలిన దర్శకులు కూడా ఇలాంటి కాంబినేషన్స్ సెట్ చేసేందుకు, థియేటర్లకి వచ్చే ఆడియన్స్ కి కనుల పండగ అందించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఆహ్వానించడం ఈ ట్రెండ్ లో భాగమే.

Crazy buzz: Allu Arjun in SRK's Jawan | 123telugu.com

బాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా పఠాన్ లో షారుక్ ఖాన్ తో పాటు సల్మాన్ కూడా ఓ గెస్ట్ రోల్లో కనిపించాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఇద్దరు బడా స్టార్లు కలిసి చేసిన రచ్చ అంత ఇంతా కాదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాకు అప్లై చేస్తున్నాడు దర్శకుడు అట్లీ. ఇందుకోసం ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ని రంగంలోకి దించుతున్నాడు. నిజానికి ముందుగా ఈ రోల్‌ గతంలో దళపతి విజయ్ దగ్గరికి వెళ్లింది.. విజయ్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇప్పుడు అల్లు అర్జున్‌ను అట్లీ రంగంలోకి దించబోతున్నాడు.

Salman Khan reminisces the funny moment when he made Ram Charan go  shirtless | Hindi Movie News - Times of India

ఇక స్టార్ హీరోల సినిమాలలో మరో స్టార్ హీరో కొద్ది నిమిషాల పాటు కనిపించే ట్రెండ్ పాతదే..! కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఎవరు ఊహించిన విధంగా దర్శకులు తీసుకువస్తున్నారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కీసి కా భాయ్ కీసికా జాన్ సినిమాలో రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగులో చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ- చిరంజీవితో పాటు నటించి సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్లాడు.

Hrithik Roshan to be seen with Prabhas in Siddharth Anand's Hindi film? -  India Today

ఇప్పుడు చిరు నటిస్తున్న మరో సినిమా భోళా శంకర్ లో కూడా తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి కనిపించబోతున్నాడు. బాలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్ తెరకెక్కించే సినిమాలో ప్రభాస్ తో పాటు హృతిక్ రోషన్ కూడా నటించబోతున్నారంటూ ఇటీవ‌ల‌ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మొత్తంగా పాన్ ఇండియా సినిమాలు కాస్త ఈ గెస్ట్ అపీరియన్స్ ట్రెండ్‌ను ఇప్పుడు మరో లెవల్ కు తీసుకువెళ్తున్నారని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.

Share post:

Latest