సీనియర్లను తక్కువ చేస్తే అంతే మరి.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..!

చిత్రపరిశ్రమలో కరోనా తర్వాత కరోనా ముందు చాలా మంది హీరోల పరిస్థితి మారిపోయింది. వారి సినీ కెరీర్ విషయం కూడా అగమ్య గోచరంగా మారింది. ప్రధానంగా ఓటీటీ రంగం వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమంలో ఉన్న సీనియర్ హీరోల సినిమాలు చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. ఇప్పుడు ఇదే విషయాన్ని రుజువు చేస్తూ కొంత మంది సీనియర్ హీరోల ప్రేక్షకుల దగ్గర నుంచి అపజయాలని తెచ్చుకున్నారు.

Veera Simha Reddy vs Waltair Veerayya At The Box Office: Balakrishna Is  Ahead Of Chiranjeevi USA Premieres As Per Initial Trends

భాషతో సంబంధం లేకుండా సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను మెప్పించ లేకపోవడంతో ఒక్కసారిగా భారతీయ చిత్ర పరిశ్రమ అంతా షాక్ అయింది. ఈ అపజయాలు తర్వాత ఆ సీనియర్ హీరోల గురించి సర్వత్ర చర్చ కూడా జరిగింది. కానీ తర్వాత ఆ కామెంట్స్ ను అబద్ధం చేస్తూ ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్లు క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి రికార్డులు క్రియేట్ చేసిన సీనియర్ హీరోలు సినిమాలు ఏంటో ఇప్పుడుచూద్దాం.

Telugu Chiranjeevi, Kamal Haasan, Pathaan, Senior Heroes, Senior Stars, Shah Ruk

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే కలెక్షన్లను రాబెట్టాడు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ యంగ్‌ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక తాజాగా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో తన స్టామినా ఏంటో చిత్ర పరిశ్రమకు మ‌రోసారి చూపించాడు. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో రూ.200 కోట్ల కలెక్షన్లను రాబట్టుకొని దూసుకుపోతున్నాడు.

Telugu Chiranjeevi, Kamal Haasan, Pathaan, Senior Heroes, Senior Stars, Shah Ruk

లోక నాయకుడు కమలహాసన్ కూడా వరుస అపజయాలతో డీలా పడిన సమయంలో గత సంవత్సరం లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేశాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో రికార్డులు సృష్టించి తనేంటో మళ్లీ బాక్సాఫీస్‌కు పరిచయం చేశాడు కమల్.

Telugu Chiranjeevi, Kamal Haasan, Pathaan, Senior Heroes, Senior Stars, Shah Ruk

అలాగే నటసింహం బాలకృష్ణ కూడా వరుస విజయాలతో చిత్ర పరిశ్రమంలో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలు పెట్టిన బాలయ్య విజయ దండయాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు తీసుకెళ్లాడు బాలయ్య. ఇక ఈ క్రమంలోనే బాలయ్య ఇటు సినిమాలతో అటు బుల్లితెరపై కూడా అన్ స్టాపబుల్ షో తో సెన్సియేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

Telugu Chiranjeevi, Kamal Haasan, Pathaan, Senior Heroes, Senior Stars, Shah Ruk

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా గత ఐదు సంవత్సరాలుగా విజయం అనే మాటకు ఆమడ దూరంలో ఉన్నాడు. తాజాగా రిపబ్లిక్ డే కానుకగా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏకంగా ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబెట్టుకుని బాలీవుడ్ చిత్ర పరిశ్రమను నిలబెట్టాడు షారుక్. ఇలా ఆరుపదుల వయసులో కూడా ఈ సీనియర్లు తమ దైన శైలితో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నారు.

Share post:

Latest