ఆస్కార్ కి ఒక్క అడుగు దూరం..’నాకు సెట్ కాదనుకుంటా’..రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్దాయికి తీసుకెళ్లాలని కొందరు డైరెక్టర్స్ కన్న కళ అలాగే మిగిలిపోయింది. అయితే వాటిని అవలీలగా ఫుల్ ఫిల్ చేశాడు రాజమౌళి . ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ ని ఏ రేంజ్ లో ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాని ఆస్కార్ కి నామినేట్ అయింది . ఆస్కార్ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో ఆర్ఆర్ఆర్ నిలిచింది, ఈ క్రమంలోని కచ్చితంగా RRR ఆస్కార్ అవార్డు కొడుతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

జక్కన్నకు ముందుగానే కంగ్రాజులేషన్స్ చెబుతున్నారు . ఈ క్రమంలోనే హాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ” చిన్నప్పటినుంచి నాపై విజయా ప్రొడక్షన్స్ చిత్రాల ప్రభావం చాలా ఉంది . మరీ ముఖ్యంగా కే వీ రెడ్డి , ఎల్వి ప్రసాద్ వంటి దర్శకులు..మాయాబజార్ , మిస్సమ్మ వంటి సినిమాలునన్ను ప్రభావితం చేశాయి అని అనుకుంటున్నాను. అలాగే హాలీవుడ్ మూవీ బెన్హర్, దర్శకులు జేమ్స్ కామెరూన్, స్పీల్బర్గ్ చిత్రాలు కూడా నాకు స్ఫూర్తినిచ్చాయి.

సినిమా తెరకెక్కించేముందు నేను ప్రేక్షకుడిగా ఆలోచిస్తాను అందుకే నా సినిమాలు అలా ఉంటాయి. మార్వెల్ ఒక పెద్ద స్టూడియో.. మార్వెల్ తో మూవీ చేయడం ఓ గొప్ప గౌరవం అనే చెప్తాను. అయితే వాళ్ళతో నాకు సెట్ కాకపోవచ్చు అనుకుంటాను. ఇక్కడ నా టీమ్ తో ఉన్న కోఆర్డినేషన్ వాళ్లతో కుదరకపోవచ్చు. వారి వర్కింగ్ స్టైల్.. నా వర్కింగ్ స్టైల్ వేరే..మా మధ్య అస్సలు పొంతన కుదరదు . ఆస్కార్ కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం” అంటూ రాజమౌళి చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు . ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

Share post:

Latest