పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే హైదరాబాదులో పూజ కార్యక్రమాలతో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. గ్యాంగ్‌స్టర్ కథాంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఓజీ సినిమా కథ పవన్ కళ్యాణ్ కంటే ముందే ఓ స్టార్ హీరో వద్దకు వెళ్లిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.
సుజీత్ మొదట మహేష్ బాబుకు ఈ సినిమా కథ వినిపించగా.. పలు కారణాల వల్ల ఆయన `ఓజీ`ని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు కథ నచ్చడంతో వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే మహేష్ బాబు ఓజీ కథను రిజెక్ట్ చేశాడా.. లేదా.. అన్నది తెలియాల్సి ఉంది.