అల్లు అరవింద్ దెబ్బకు మకాం మార్చేసిన పరుశురామ్‌.. విజయ్ దేవరకొండ సంగతేంటి..!

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీత గోవిందం సినిమాతో భారీ హీట్ అందుకున్నాడు దర్శకుడు పరశురామ్ .ఈ సినిమా తర్వాత మహేష్ తో సర్కారు వారి పాట సినిమా తీసి ఓ మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమాను నాగచైతన్యతో చేయాల్సి ఉండగా ఆ మూవీ స్క్రిప్ట్ విషయంలో చైతు- పరశురామ్ మధ్య తేడా రావడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

Allu Aravind Upset With Parasuram Over Vijay Deverakonda's Upcoming Release  Announcement | Deets Inside

ఈ క్రమంలోనే రీసెంట్‌గా పరశురామ్ , విజయ్ దేవరకొండ తో గీత గోవిందం2 అనౌన్స్ చేశారు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లు కూడాా ప్రకటించాడు. పరుశురామ్‌ చేసిన ఈ పనికి అల్లు అరవింద్ కోపంతో అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. విజయ్ తో గీత ఆర్ట్స్ లో చేయాల్సిన సినిమాను దిల్ రాజు తో ఎలా చేస్తాడు అంటూ మాతో చేయాల్సిన సినిమా సంగతి ఏమిటని అక్కడికక్కడే నిలదీశాడు అల్లు అరవింద్. ఆ సమయంలో అల్లు అరవింద్ దగ్గర పరశురామ్ అడ్వాన్స్ తీసుకున్నాడని టాక్ కూడా నడిచింది. ఇక ఈ కారణంగానే అల్లు అరవింద్ కి బాగా కోపం వచ్చింది.

మరి ఈ మెగా ప్రొడ్యూసర్ తో పెట్టుకుంటే పరిశ్రమలో ఎదగలేమని తెలుసుకున్న పర‌శురామ్‌ నేరుగా అల్లు అరవింద్ ను కలిసి క్షమాపనలు చెప్పాడని కూడా తెలుస్తుంది. అల్లు అరవింద్ శాంత పడలేదని సమాచారం అందుతుంది. పరుశురామ్‌, దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ తో సినిమా అనౌన్స్ చేయడం ఎంత పెద్ద వివాదానికి దారి తీసింది.

తమిళ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న డైరెక్టర్ పరశురామ్.. ఆ హీరో ఎవరంటే |  director parasuram planning a movie with kollywood hero karthi rumours went  viral details, parasuram, kollywood ...

ఇక ఇప్పుడు సడన్ గా పరుశురామ్‌ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకు రేంజ్ రాజు అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండతో ప్రకటించిన సినిమా ఏమైంది..? ఎప్పుడు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది..? ఇవన్నీ కాకుండా కార్తితో సినిమా చేస్తారా? విజయ్‌తో సినిమా పూర్తయ్యాక ఈ సినిమా చేస్తారా అనే సందేహాలు ఇప్పుడు అందరిలో మొదలయ్యాయి. అయితే కార్తీ, పరశురామ్‌ సినిమాపై ఇంకా అధికార ప్రకటన అయితే బయటికి రాలేదు. త్వరలోనే ఈ కాంబోపై అధికార ప్రకటన రానుందని తెలుస్తుంది.