హ‌ద్దులు మీరిన నంద‌మూరి ఫ్యాన్స్ ..తోక కత్తిరించిన ఎన్టీఆర్‌..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ ఉన్న భారీ సినిమాలలో టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించునున్న NTR 30వ సినిమా కూడా ఒకటి ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చి సంవత్సర కాలం అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. దీంతో ఈ సినిమా లేట్ అవుతుందన్న భవనతో అభిమానులు మాత్రం అంతకంతకు తొందర పడుతున్నారు.

Amigos: ఎన్టీఆర్ వచ్చేసాడు… ఎన్టీఆర్ స్పెషల్ AV అదిరిపోయింది - NTV Telugu

దీంతో ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ కోసం సోషల్ మీడియాలో చేయని హంగామా లేదు. ఫైనల్ గా ఈ సినిమాపై ఏకంగా ఎన్టీఆర్ నే స్వయంగా స్పందించాల్సి వచ్చింది. నిన్న కళ్యాణ్ రామ్ నటించిన అమీగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ ఏదైనా ఉంటే నేను తప్పకుండా మీకు అందిస్తానని కానీ మీరు ఇలా నాన్ స్టాప్ గా అడగటం డైరెక్టర్ మరియు సినిమా యూనిట్ పై ప్రెజర్ పెట్టినట్టు అవుతుంది. ఏదైన‌ ఖచ్చితంగా పవర్ఫుల్ అప్డేట్ ఉంటే తన భార్య కంటే కూడా ముందుగా మీతో పంచుకుంటా అని చెప్పుకొచ్చాడు.

బాబోయ్‌ అన్నా.. మరీ లావు అవుతున్నావు కాస్త చూసుకో | Big Talk About NTR  Weight Details, Koratala Siva, Ntr, Ntr30, Ntr And Koratala Siva, Ntr  Weight, Kalyan Ram, Amigos, Amigos Pre Release Event, Prasanth

ఇది మీ సోదరుడుగా నా విన్నపమని ఎన్టీఆర్ చెప్పారు. అలాగే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి ప్రపంచ సినిమాల దృష్టిలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. అలాంటి సమయంలో సినిమాని ఇంకెంత ఫోకస్గా తీయాలని ఎన్టీఆర్ ఎంతో అద్భుతమైన వివరణ ఇచ్చి తన అభిమానులకు దిశ నిర్దేశం చేసాడు. దీంతో ఇక ఎన్టీఆర్ అన్న మాటల దగ్గర నుంచి ఆయన అభిమానులు కొంత సమయమునంగా ఉంటారని చెప్పవచ్చు ఎందుకంటే సినిమాల పరంగా హీరో మాటలని జవదాటని అభిమానులు లేరు.