ఈ స్టార్ హీరోల‌కు ఇప్పుడు కొత్త మోజు ప‌ట్టుకుందే…!

ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా సినిమాల‌ హ‌వా న‌డుస్తుండంతో బాలీవుడ్ న‌టులు కూడా మంచి క‌థ‌లు వ‌స్తుండ‌టంతో వారు సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. ఆ బాలీవుడ్ న‌టులు కమిట్‌ అయిన సౌత్‌ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్ప‌టీకే ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2’ ద్వారా దక్షిణాది తెరపై సంజ‌య్‌ద‌త్‌ కనిపించారు. కన్నడంలో సంజయ్‌ దత్‌ చేసిన తొలి సినిమా కూడా ఇదే. తాజాగా తమిళ చిత్రం లియోకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు సంజయ్‌ దత్‌.

It's Vijay Vs Sanjay Dutt in Lokesh Kanagaraj's Thalapathy 67: reports |  Entertainment News,The Indian Express

విజయ్‌ హీరోగా వ‌స్తున్న ఈ సినిమాకి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. సంజయ్‌కు తమిళంలో ‘లియో’ తొలి సినిమా కావడం విశేషం. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమాలో అమితాబ్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రంతోనే తెలుగుకు పరిచయం అవుతున్నారు దీపికా పదుకోనె.. ‘ప్రాజెక్ట్‌ కె’ వచ్చే ఏడాది జవనరి 12న రిలీజ్‌ కానుంది. మరో బీటౌన్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ సైతం సౌత్‌పై ఫోకస్‌ పెట్టారని చెప్పొచ్చు.

Vikram Vedha star Saif Ali Khan opens up on the bond he shares with Amitabh  Bachchan; says, “I could write reams about him” : Bollywood News -  Bollywood Hungama

తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘ఆది పురుష్‌’లో నటించారు సైఫ్‌ అలీఖాన్‌. ఈ చిత్రం జూన్‌ 16న రిలీజ్‌ కానుంది. కాగా ఎన్టీఆర్‌ హీరోగా నటించనున్న తాజా చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ ఓ కీ రోల్‌ చేయనున్నారనీ తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో వ‌స్తున్నా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. మరోవైపు హిందీలో రెండు దశాబ్దాలుగా మంచి పాత్రలు చేస్తూ, నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కూడా సౌత్‌ సినిమా ‘సైంధవ్‌’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Nawazuddin Siddiqui To Make His South Debut With Venkatesh?

వెంకటేశ్‌ హీరోగా ‘హిట్‌’ ఫ్రాంచైజీ ఫేమ్‌ దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వంలో వ‌స్తున్నా చిత్రమే ‘సైంధవ్‌’. నవాజుద్దీన్‌కు తెలుగులో ఇది తొలి సినిమా…వెంకటేశ్‌ కెరీర్‌లో 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇక ఇంకో బాలీవుడ్‌ హీరో బాబీ డియోల్‌ సైతం తెలుగు తేర‌పై క‌నిపించ‌బోతున్నాడు. ప‌వ‌న్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తునా ‘హరి హర వీర మల్లు సినిమాలో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు బాబీ డియోల్‌.

Bobby Deol to make Telugu debut with Pawan Kalyan's Hari Hara Veera Mallu,  will play Aurangzeb - India Today

ఈ సినిమాను కూడా ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. మరోవైపు దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఓ పీరియాడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రెండు ప్రధాన పాత్రలతో సాగే ఈ సినిమాలో ఓ హీరోగా విజయ్‌ సేతుపతిని, మరో హీరోగా బాలీవుడ్ హీరో అభిషేక్‌ బచ్చన్‌ను అనుకున్నారట గౌతమ్‌ మీనన్‌. మరి అభిషేక్‌ ఓకే చెబుతారా? అనేది చూడాలీ. ఇదే కోవలో మరి కొందరు బాలీవుడ్‌ తారలు దక్షిణాది సినిమాల‌కు డేట్స్‌ ఇచ్చారు.

Share post:

Latest