పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్..ఈ ట్వీస్ట్ మామూలుగా లేదుగా..!!

మృణాల్ ఠాకూర్.. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చేమో కానీ ..సీత అంటే మాత్రం టక్కున జనాలు గుర్తుపట్టేస్తారు. అంతలా తన ఒరిజినల్ నేమ్ కన్నా క్యారెక్టర్ నేమ్ తోనే పాపులారిటీ సంపాదించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ . మృణాల్ ఠాకూర్ అదేనండి .. మన సీత .. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సీతారామం సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఉన్నా సరే అందరి కళ్ళు ఈ మృణాల్ ఠాకూర్ పైనే పడ్డాయి . చాలా పద్ధతిగా ..క్లాస్ గా ..కూల్ గా ట్రెడిషనల్ గా ..కనిపించిన మృణాల్ ఠాకూర్ ఒకే ఒక్క సినిమాతో తెలుగులో హ్యూజ్ పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంది.

అంతెందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , నాచురల్ స్టార్ నాని ,యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ముగ్గురు కూడా తమ నెక్స్ట్ సినిమాలలో అమ్మడుకి ఛాన్స్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు ..అంటే మృణాల్ ఠాకూర్ ఎంతలా తన అందాలతో వారిని అట్రాక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు . సీతారామం సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా గత కొన్ని రోజులుగా మృణాల్ పెళ్లి చేసుకోబోతుందని.. సినిమాలకు గుడ్ భై చెప్పేస్తుందని..వార్తలు వైరల్ అయ్యాయి.

ఇలాంటి వాటిని కొట్టి పడేసింది మృణాల్.. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చింది. రీసెంట్ గా లెహంగా చోళీలు అచ్చం మహారాణిలా కనిపించింది. తెలుగులో పాటు హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటున్న మృణాల్ రీసెంట్గా డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా నిర్వహించిన ఫ్యాషన్ ఈవెంట్‌లో మృణాల్ ర్యాంప్ వాక్ చేశారు. ఈవెంట్లో అందంగా రెడీ అయ్యి లెహంగా చోళీ లో చాలా క్యూట్ గా ట్రెడిషనల్ గా కనిపించింది . ఈవెంట్ లో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంతి చతుర్వేదితో కలిసి రాంప్ వాక్ చేసిన మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే మృణాల్ ముందు ఎలాంటి అందగత్తెలు సరిపోరు అంటూ ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు . చూడాలి మరి ముందు ముందు ఎలా మెప్పిస్తుందో ఈ మృణాల్..?

 

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)