ఏంటీ.. ఆఫ‌ర్ల కోసం ఆ హీరోతో కీర్తి సురేష్ అలాంటి ప‌నికి ఒప్పుకుందా?

తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ ఒకటి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ‌.. ఆ తర్వాత హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. తనదైన అందం అభినయం నటనా ప్ర‌తిభ‌తో తెలుగు, తమిళ, మ‌ల‌యాళ‌ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కానీ వ‌రుస ఫ్లాపుల‌ కారణంగా ఇటీవల కీర్తి సురేష్ గ్రాఫ్ క్రమంగా డౌన్ అయింది.

దీంతో ఆఫ‌ర్ల కోసం ఈ అమ్మడు గ్లామర్ షోకు తెరలేపింది. కెరీర ఆరంభం నుంచి ఎంతో పద్ధతిగా కనిపించిన కీర్తి.. ఇటీవల అందాల ఆరబోత‌లో హద్దులు దాటేస్తుంది. అలాగే డీ గ్లామ‌ర్‌ పాత్రలకు సై అంటుంది. ఇక ఇటీవల ఓ హీరోతో ఏకంగా లిప్ లాక్‌ సన్నివేశం చేయడానికి కూడా ఒప్పేసుకుందట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు న్యాచురల్ స్టార్ నాని. వీరిద్దరూ `దసరా` సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు.

మార్చి 30న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమాలో ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ త‌ర్వాత ఘాటైన లిప్ లాక్ స‌న్నివేశం ఉంటుంద‌ట‌. ఈ స‌న్నివేశం మొద‌ట స్క్రిప్ట్ లో లేక‌పోయినా.. కనెక్టింగ్ బాగుంటుందని దర్శకుడు ఆ త‌ర్వాత యాడ్ చేశాడ‌ట‌. ఇక లిప్ లాక్ ప్రపోజల్ తో కీర్తి ముందుకు వెళ్లగా.. ఆమె వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌. దీంతో ఆఫ‌ర్ల కోసం కీర్తి త‌న‌ కండీషన్ల‌ను దాదాపు చెరిపేసిందంటూ ఇండ‌స్ట్రీలో ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Share post:

Latest