టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.. సౌత్ సినిమా పరిశ్రమంలోనే వరుస సినిమాలలో నటించి ఇటీవల పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే సెన్సేషనల్ దర్శకుడు శంకర్, కమలహాసన్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.
ఇప్పుడు కాజల్ కెరీర్ మొదటిలో ఆమెకు జరిగిన అవమానం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ టేకింగ్ ఉన్న దర్శకులలో తేజ కూడా ఒకరు. తన కెరీర్ మొదటిలో ముఖ్యంగా వరుస విజయాలతో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న తేజ.. తన ప్రతి సినిమా షూటింగ్లో కూడా ఎవరో ఒకరిని కొడుతూ ఉండేవాడు.
అలా తేజ చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళు ఫ్యూచర్లో మంచి నటులు అవుతారన్న మాట కూడా చిత్ర పరిశ్రమలో వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తేజా దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాలో హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. అయితే ఒక రోజు ఈ సినిమా షూటింగ్లో ఒక సీన్ లో కాజల్ యాక్టింగ్ సరిగ్గా చేయలేదు.. దర్శకుడు ఎన్ని సార్లు చెప్పిన సరిగా చేయకపోవడంతో విసిగిపోయిన తేజ, కాజల్ ను చెంప మీద ఒక దెబ్బ కొట్టాడట.
దాంతో ఆమె సెట్ నుంచి బయటకు వెళ్లి పోగా ఆ తర్వాత హీరో నిర్మాతలు ఆమె బుజగించి తీసుకురాగా ఆ తర్వాత ఆమె సెట్ అయి బాగా నటించిందని తేజ ఓ ఇంటర్వ్యూలో మీడియాతో వెల్లడించారు. నిజానికి నటీనటునలతో ఇలా దెబ్బలు కొట్టి యాక్టింగ్ చేయించుకోవడం తేజకు ఇది కొత్త ఏమీ కాదు. అందుకే లక్ష్మీ కళ్యాణం సినిమా ప్లాప్ అయినప్పటికీ కూడా కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ నటనకు మంచి పేరు వచ్చింది.
ఈ సినిమాతో కాజల్‌కు మంచి పేరుతో పాటు తన నటనకు మంచి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో అవకాశం వచ్చి ఒకే ఒక రాత్రిలో స్టార్ హీరోయిన్‌గా అయిపోయింది కాజల్. ఆ తర్వాత చాలా సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా మారింది ముద్దుగుమ్మ.