ఆ రివ‌ర్స్‌ లాజిక్ జ‌గ‌న్‌కు వ‌ర్తించ‌దా…!

రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని లాజిక్కులు అద్భుతంగా ఉంటాయి. గ‌త ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్న ప‌రిణామా ల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే నాయ‌కులు.. ప్ర‌తికూలంగా మారుస్తూ.. పొరుగు పార్టీపై విరుచు కుప‌డే నేత‌లు.. చాలా మంది ఉన్నారు. అందుకే రాజ‌కీయాల్లో లాజిక్కుల‌కు పెద్ద ప్రాధాన్యం ఉంటుంది. గ‌త 2019 ఎన్నిక‌ల నుంచి ఒక కీల‌క విష‌యాన్ని వైసీపీ అధినేత జ‌గ‌న్ చెబుతున్నారు.

టీడీపీకి 2019 ఎన్నిక‌ల్లో 23 స్థానాలు రావ‌డానికి సంబంధించి జ‌గ‌న్ చెప్పిన లాజిక్ అంద‌రికీ తెలిసిందే. దీనికి ముందు.. త‌మ పార్టీ త‌ర‌ఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు లాక్కున్నార‌ని.. అదే విధంగా ముగ్గురు ఎంపీల‌ను కూడా సొంతం చేసుకున్నార‌ని.. అందుకే ఆ దేవుడు టీడీపీకి 23 మంది ఎమ్మె ల్యేల‌ను, ముగ్గురు ఎంపీల‌నే ఇచ్చాడ‌ని..లాజిక్ చెబుతూ వ‌చ్చారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే లాజిక్ వైసీపీకి కూడా వ‌ర్తిస్తుంది క‌దా..! అంటే.. టీడీపీ నుంచి లాగేసుకున్న న‌లు గురు ఎమ్మెల్యేలను.. (వారితో రాజీనామాలు చేయించ‌లేదు.) గ‌మ‌నిస్తే.. వ‌చ్చే 2024లో వైసీపీకి కూడా ఇంతే సంఖ్య ద‌క్కుతుందా? అంటే.. తూచ్‌. ఇదేం జ‌ర‌గ‌ద‌ని అంటున్నారు. ఆ లాజిక్ త‌మ‌కు వ‌ర్తించ‌ద‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. తాజాగా ఒక మీడియా స‌మావేశంలో కీల‌క మంత్రి ఒక‌రు ఇదే చెప్పారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ 175కి 175 సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని అన్నారు స‌ద‌రు మంత్రి. అయితే.. ఈ సంద‌ర్భంగానే లాజిక్ ప్ర‌స్తావ‌న వ‌చ్చేస‌రికి.. త‌మ‌కు అది వ‌ర్తించ‌ద‌ని చెప్పుకొచ్చారు. అంటే.. త‌మ‌కు వ‌ర్తించ‌ని లాజిక్ కేవ‌లం ప్ర‌తిప‌క్షానికి మాత్ర‌మే వ‌ర్తిస్తుందా ? అనేది ప్ర‌శ్న‌. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో. ఏదేమైనా.. వైసీపీ నేత‌లు.. ఒకింత దూకుడుగానే ఉన్నార‌ని చెప్పాలి.