హీరో శర్వానంద్ పెళ్ళి ఆగిపోయిందా..? ఇదేం ట్వీస్ట్ రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. ఏ న్యూస్ నిజమో .. ఏ న్యూస్ అబద్ధమో తెలుసుకోలేకపోతున్నారు జనాలు . అలా అని సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వార్త అబద్దం అని కొట్టి పడేయలేం . ఎందరెందరో సెలబ్రెటీస్ లైఫ్ సోషల్ మీడియాలో ముందు వచ్చిన వార్తల నిజమయ్యాయి. టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత హీరో నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ మీడియాలో మూడు నెలల ముందు నుంచే ప్రచారం జరిగింది .

కేవలం ఇవే కాదు ఎంతోమంది సినిమా స్టార్ సెలబ్రిటీస్ విషయాలలో జరిగే విషయాలు ముందుగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి . కాగా రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ పెళ్లి ఆగిపోయింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న హీరో శర్వానంద్ పెళ్లి ఆగిపోయింది అంటూ కొందరు ఆకతాయిలు రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు .

అయితే అందుతున్న సమాచారం ప్రకారం శర్వానంద్ పెళ్లి ఆగిపోలేదు ..పోస్ట్ పోన్ అయింది . కొన్ని ఫామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఆయన అనుకున్న పెళ్లి డేట్ ను వాయిదా వేశారట శర్వానంద్ . ఈ క్రమంలోనే ఆ వార్త కాస్త పెళ్లి ఆగిపోయింది అనే వరకు పుట్టుకొచ్చింది . జనవరి 26న గ్రాండ్గా రక్షిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్ ..ప్రజెంట్ సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రక్షిత రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రెసెంట్ ఇండియాలోనే వర్క్ చేసుకుంటుంది. ఆ విధంగా వీళ్ల ప్రేమ మొదలై ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకొని ఒక్కటి అవ్వబోతున్నారు..!!

Share post:

Latest