ఈ స్టార్ హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్లు చూస్తే ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ‌తాయ్‌…!

ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా సినిమాల‌ హ‌వా న‌డుస్తుండంతో బాలీవుడ్ న‌టిమ‌ణులు కూడా మంచి క‌థ‌లు వ‌స్తుండ‌టంతో వారు సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. ఆ బాలీవుడ్ భామ‌లు కమిట్‌ అయిన సౌత్‌ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్ లో పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ సీతారామంకి ముందు బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చింది. ఈమె తెలుగులో నానితో ఓ సినిమాకు క‌మిట్ అయింది.

Nani To Romance Mrunal Thakur In His 30th Movie, Unveils Some Exciting  Deets About It As A Treat To Fans

ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించింది. అలాగే సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ ఇంటరెస్టింగ్ రోల్ లో నటించింది. అలాగే ప్రాజెక్ట్ kలో దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఇక శంకర్, రామ్ చరణ్ కాంబోలో వ‌స్తున్న‌ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్, కొర‌ట‌ల కాంబోలో వ‌స్తున్నా ఎన్టీఆర్ 30వ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

B-Town Celebs opting Tollywood", Janhvi Kapoor to make her South debut with  Jr NTR - MetroSaga

ఇలా ఇప్పుడు బాలీవుడ్ భామలు అందరూ కూడా మన తెలుగు స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలలో న‌టించ‌డానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు సౌత్ సినిమాలు అసలు ఒప్పుకొని ఈ ముద్దుగుమ్మలు సౌత్ సినిమాల కోసం వెంపర‌లాడుతున్నారు. ఎప్పుడైతే మన సౌత్ సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము లేపడంతో.. అప్పటినుంచి వారి దృక్పథం కూడా మారింది. దీంతో అప్పటినుంచి తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

प्रभास की दुल्हनिया बनेंगी कृति सेनन! मालदीव में करने वाले हैं सगाई?  'बाहुबली' की टीम ने बताई पूरी सच्चाई | kriti sanon and prabhas soon get  engaged in maldives actor ...

ఇక వారు నటించే తెలుగు సినిమాల్లో రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే పుచ్చుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తక్కువ కాల్స్ షీట్స్ అయినా రూ.5 కోట్ల రెమ్యునరేషన్ అలియా భట్ తీసుకుంది. ఇక జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ 30 కోసం రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తుంది.
అయితే నిర్మాత రూ.4 కోట్లు ఇవ్వడానికి ఒకే చెప్పాడని టాక్. ఇక కియరా అద్వానీ రూ.5 కోట్లు చార్జ్ చేసిందని తెలుస్తుంది. ఆదిపురుష్ కోసం కృతి సనన్ రూ.5 కోట్లు డిమాండ్ చేసింది.

Project K: Disha Patani joins Prabhas and Deepika Padukone

ఇక ప్రాజెక్ట్ k కోసం దిశా పటాని రూ.5 కోట్లు తీసుకుంటూ ఉండగా.. దీపికా పదుకునే తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఏకంగా రూ.18 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తుంది. అంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి కూడా నిర్మాత రెడీ అయినట్టు తెలుస్తుంది. ఈ విధంగా ఒకప్పుడు సౌత్ సినిమాలంటే ఆమడ దూరం పారిపోయిన ఈ బాలీవుడ్ భామలు ఇప్పుడు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ సౌత్ సినిమాల్లో నటించడానికి క్యూ కడుతున్నారు.

Share post:

Latest