చిరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా… ఆమె అంటే అంత ఇష్టం ఏంటో…!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ తో బోళా శంకర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జంటగా తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా సింగర్ స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న చిరు ఈ షోలో తన ఫ్యామిలీ గురించి, తన సినీ కెరీర్ గురించి ఆమెతో పంచుకున్నాడు.

అలాగే తన సినీ ప్రయాణంలో తనతో కలిసి నటించిన హీరోయిన్స్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు చిరు. ఆ టైంలో ఉన్నరాధా, విజయశాంతి, రాధిక, మాధవి, శ్రీదేవి వంటి అగ్ర హీరోయిన్ల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఆ రోజుల్లో చిరంజీవితో కలిసి నటించిన వారి గురించి స్మిత అడగగా, రాధిక శరత్ కుమార్, రాధా, విజయశాంతి, శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్స్ లో ఎవరు బెస్ట్ అంటే చెప్పడానికి మెగాస్టార్ చిరంజీవి నిరాకరించారు.

చిరు ఫేవరెట్ హీరోయిన్ ఆవిడే.. ఆమెలో నచ్చిన క్వాలిటీస్ ఇవేనట..!!

వారందరితోనో నాకు మంచి రిలేషన్ ఉందని.. వారితో నాకు ఎంతో అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని చెప్పుకొచ్చారు. అలాగే వారిలో ఒక్కొక్కరికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని కూడా చిరు అన్నారు. వారిలో రాధిక ఎంతో సహజంగా నటిస్తుందని, అలాగే తనతో డ్యాన్స్ చేసే విషయంలో రాధ‌ పర్ఫెక్ట్ అని, సినిమాలో తన క్యారెక్టర్ కు తగ్గట్టు తనను తాను మార్చుకునే గొప్పతనం విజయశాంతి సొంతమని, అలాగే రాధా, విజయశాంతి డాన్స్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని అన్నారు.

Jagadeka Veerudu Athiloka Sundari'

అలాగే అతిలోకసుందరి శ్రీదేవితో తన వ్యక్తిగత వృత్తిపరమైన రిలేషన్ ఉండేదని ఇప్పటికీ ఆ ఫ్యామిలీతో అది అలాగే కొనసాగుతుందని చిరు చెప్పుకొచ్చాడు. అందుకే వారిలో నాకు శ్రీదేవి ఫేవరేట్ హీరోయిన్ అని అన్నాడు. శ్రీదేవితో పనిచేసిన‌ ప్రతి క్షణాన్ని ఆస్వాదించా…తెలుగు సినిమాల్లో తమ జంట ఇప్పటికీ కూడా ఉత్తమ జంటగానే ఉంటుందన్నారు. శ్రీదేవి నటన, డాన్స్ బెస్ట్. అందుకే ఆమెతో జగదేక వీరుడు అతిలోక సుందరి, మోసగాడు, ఎస్పీ పరశురామ్ చిత్రాల్లో నటించానని అన్నారు చిరు.

Share post:

Latest