టాలీవుడ్ పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి దిగి అటు పొలిటికల్ గాను ఇటు సినిమా రంగం గాను మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు . ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిలకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
కాగా రీసెంట్గా అన్ స్టాపబుల్ సీజన్ 2 కి గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ వాటిపై ఘాటుగా స్పందించారు . “నేను ఒకేసారి ఆ మూడు పెళ్లిల్లు చేసుకోలేదు రా నాయన,, పలు సందర్భాలలో నా పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా ముగ్గురిని వేరువేరుగా పద్ధతిగా విడాకులు ఇచ్చి చట్ట బద్ధంగా పెళ్లి చేసుకున్నాను “అంటూ ఘాటుగా స్పందించారు . ఇలాంటి క్రమంలోని చిన్నతనంలో తాను ఆస్త్మా వ్యాధితో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కి ఆస్తమావ్యాధి ఉందని ఎవరికీ తెలియదు .. ఫస్ట్ టైం ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు పవన్ కళ్యాణ్ .
ఈ క్రమంలోనే ” 6,7 తరగతిలో నేను బయటికి వెళ్లి ఆడుకోలేకపోయానని ..నా ఫ్రెండ్స్ కూడా దగ్గరకు వచ్చేవారు కాదని.. ఆ క్రమంలోనే పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకున్నానని చెప్పుకొచ్చారు . అప్పుడు మొదలైన అలవాటు ఇప్పటికి తనకు వ్యసనంలా మారిపోయిందని .. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదివేస్తానని చెప్పుకొచ్చాడు . పవన్ కళ్యాణ్ ఏజ్ కు తగ్గ సినిమాలు చేస్తున్నాడు. వీటిపై కూడా క్లారిటీ ఇచ్చాడు . పలువురు డైరెక్టర్స్ నా వద్దకు వచ్చి పలు రొమాంటిక్ సినిమాల్లో నటించమంటున్నారని .. అలా నేను చేయలేనని నేను నా వయసుకి తగ్గ పాత్రలే చేస్తానని.. కచ్చితంగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలైతే ఇంట్రెస్ట్ చూపిస్తానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని యాంటి ఫాన్స్ అందుకే నా.. పవన్ కళ్యాణ్ లో పవర్ తగ్గింది అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు పవన్ కళ్యాణ్ లో ఉన్న నిజాయితీకి హాట్సాఫ్ చెబుతున్నారు..!!