తారకరత్న మృతి: చివరి నిమిషాలల్లో డాక్టర్లు హైడ్రామా..ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..?

నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి మృతి చెందారు. కాగా 23 రోజుల పాటు సుదీర్ఘంగా చావు తో పోరాడిన తారకరత్న చివరిగా ఓడిపోయి ప్రాణాలను వదిలేశాడు. ఈ క్రమంలోని నందమూరి ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా తారకరత్న చనిపోయే రెండు గంటల ముందు నారాయణ హృదయాలయ హాస్పిటల్ వద్ద హంగామా నడిచిందని అక్కడ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా తారకరత్న ని చూడడానికి గతి 23 రోజులుగా హాస్పిటల్ వద్ద పడికాపులు కాసిన అభిమానులకు ఆయన చివరి చూపులు కూడా దక్కించలేదని.. పార్థివదేహాన్ని హైడ్రామా నేపథ్యంలో హాస్పటల్ బ్యాక్ సైడ్ నుంచి అంబులెన్స్ తరలించారని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు వారం రోజులు ముందు కూడా తారకరత్న హెల్త్ కండిషన్ బాగుందంటూ డాక్టర్లు చెప్పకు వచ్చారని.. సడన్ గా రెండు రోజులు ముందు నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని డాక్టర్లు చెప్పడంలో ఫాన్స్ కొత్త డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. అసలు తారకరత్నకు ఏం బాగాలేదు..? గుండె నొప్పి రావడంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత ఏమైంది..? ఎందుకు కోమాలోకి వెళ్లిపోయాడు ..? కోమలాకి వెళ్లిపోయాక తారకరత్నకు ఎలాంటి చికిత్స అందించారు..? ప్రతి విషయాన్ని అభిమానులకు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు .

అంతేకాదు రెండు రోజులు ముందు వరకు బాగానే ఉన్న తారకరత్న ఆరోగ్యం రాత్రికి రాత్రి ఎందుకు క్షణించింది.. దానికి సంబంధించిన హెల్త్ బుల్లెట్ రిలీజ్ చేయనే లేదు. సడన్గా తారకరత్న మృతి చెందాడు అని చెప్తే ఎలా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు నిజానికి తారకరత్న సుమారు 7:30 గంటలకు ప్రాంతంలోనే చనిపోయారని.. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి డాక్టర్లు 9 గంటల 45 నిమిషాలకు అఫీషియల్ గా అనౌన్స్ చేశారని .. ఈ రెండు గంటలసేపు హాస్పిటల్లో ఏం జరిగింది అంటూ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు . అయితే నందమూరి ఫ్యాన్స్ హాస్పిటల్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొనేలా చేస్తారని..అందుకే ఇలా హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి పార్ధివ దేహాని తరలించినట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే తారకరత్న మన మధ్య లేడు అన్న వార్తను జీర్ణించుకోవడం అంత సులభమైన విషయం కాదు..!!