చెర్రీ మిస్ అయ్యాడు… బ‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు…!

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.. పాన్ ఇండియా హిరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. పుష్ప2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా ప‌లు సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్పుడు ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తోలి సినిమా గంగోత్రి ఈ సినిమాను దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు త‌న 100వ సినిమాగా తెర‌కెక్కించాడు. ఈ సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు ఈ స్థాయికి వెళ్ళాడు. అయితే ఇప్పుడు గంగోత్రి సినిమా గురించి నాగబాబు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

Watch Gangotri Movie Online for Free Anytime | Gangotri 2003 - MX Player

గంగోత్రి సినిమాలో హీరోగా నటించడానికి మొదట రామ్ చరణ్‌కు ఆఫర్ వచ్చిందని, అయితే చిరంజీవి వల్ల అల్లు అర్జున్ ఈ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. ముందుగా రామ్ చరణ్ కి గంగోత్రి సినిమాలో హీరోగా అవకాశం వచ్చిన చరణ్ హీరోగా పరిచయం అవడానికి ఆ సమయానికి చాలా చిన్నవాడని భావించిన చిరు.. ఈ సినిమాకు అల్లు అర్జున్ హీరోగా సెట్ అవుతాడంటూ అతని రిఫర్ చేశాడట‌.

గంగోత్రి సినిమా అవకాశం వచ్చినప్పుడు రామ్ చరణ్ కి సినిమాలపై సరైన అవగాహన లేకపోవటం వల్లే చిరంజీవి ఇలా చేశారని నాగబాబు చెప్పుకొచ్చాడు. కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాతోనే ఆర్తీ అగ‌ర్వాల్ చెల్లి అతిథి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది.