బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: ఎన్టీఆర్ – ధనుష్ కాంబోలో భారీ మల్టీ స్టారర్ ఫిక్స్ ..డైరెక్టర్ ఎవరంటే..?

ఇది నిజంగా నందమూరి అభిమానులకు కేక పట్టించే న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు ఎన్టీఆర్ ఎందుకు సినిమాలు చేయడం లేదు ..? తన సినిమాలకి సంబంధించిన అప్డేట్ ఎందుకు ఇవ్వడం లేదు అంటూ బుర్రపిక్కున్న ఫ్యాన్స్ కు.. ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేసాడు.. రీసెంట్గా ఈవెంట్లో ఎన్టీఆర్ థర్టీ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు ఇస్తామని.. దయచేసి గోల చేయొద్దంటూ ఎన్టీఆర్ నే స్వయంగా ప్రకటించాడు .

ఈ దెబ్బతో గప్ చుప్ అయిపోయిన నందమూరి ఫ్యాన్స్ ..సోషల్ మీడియాలో ఆయన సినిమాలకు సంబంధించిన ఊసే ఎత్తడం లేదు . అయితే అలాంటి అభిమానులకు ఎన్టీఆర్ గుడ్ న్యూస్ అందించబోతున్నట్లు తెలుస్తుంది . బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్న ఎన్టీఆర్ ..త్వరలోనే మరో మల్టీ స్టార్ సినిమాకి సైన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ధనుష్ తో ఎన్టీఆర్ క్రేజీ మల్టీస్టారర్ ను ఫిక్స్ అయినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది .

అంతేకాదు వీళ్ళిద్దరి కాంబోలో సినిమాని సెట్ చేసిన డైరెక్టర్ ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వెట్రిమారన్.. ఈ సినిమా కూడా బాహుబలి ల రెండు పార్టులుగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథ వివరించిన డైరెక్టర్ త్వరలోనే ఈ సినిమా పై అఫీషియల్ ప్రకటన చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుతుంది . ఏది ఏమైనా సరే ధనుష్ – తారక్ తెరపై కలిసి నటిస్తే ఆ కిక్కే వేరు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!