స్టార్ డైరెక్టర్ పై అల్లు అరవింద్ సీరియస్..నిలువునా ముంచేసావు కదారా సామీ..!?

ఇది నిజంగా ఓ బిగ్ షాక్ అనే చెప్పాలి.. నిన్న మొన్నటి వరకు చేతిలో చేయి వేసుకుంటూ తిరిగిన అల్లు అరవింద్ – డైరెక్టర్ పరుశురాం ..ఒక్క ప్రకటనతో బద్ధ శత్రువులుగా మారిపోయారు . ఇప్పుడు ఒక పేరు చెప్తే ఒకరికి మండిపోతుంది ..అంతలా చిదరించుకుంటున్నారు ..దానికి మెయిన్ రీజన్ దిల్ రాజు అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . మనకు తెలిసిందే దిల్ రాజు టాలెంటెడ్ పర్సన్.. ఎక్కడ ఎవర్ని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన మనిషి ..ఎక్కడ నొక్కితే పనులు జరుగుతాయి ..ఎక్కడ వంగితే ప్రాఫిట్ లు వస్తాయి అన్న లెక్కలు బాగా తెలుసు . అందుకే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే అగ్ర ప్రొడ్యూసర్ గా మారి సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నారు.

కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ..ఏ సినిమా ఎప్పుడు ఓటీడీలోకి రావాలి అన్న అన్ని అంశాలు దిల్ రాజునే డిసైడ్ చేస్తున్నాడు అంటూ న్యూస్ గత కొన్ని నెలలుగా వైరల్ అవుతూనే ఉంది . కాగా ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పరశురాంతో చేతులు కలిపాడు దిల్ రాజు . విజయ్ దేవరకొండ హీరోగా పెట్టి దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాపై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. వీళ్ళ ముగ్గురు కలిసి దిగిన పిక్ ని పోస్ట్ చేస్తూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్ర బృందం. నిజానికి గీతాగోవిందం 2 సినిమాను నిర్మించాలి అని అనుకున్నింది అల్లు అరవింద్ ..ఆల్రెడీ దీనికి సంబంధించి భారీ మొత్తంలో పరుశురాంకి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారట .

కానీ ఆఖరి మూమెంట్లో దిల్ రాజు ని మాయ చేసి పరుశురాంను ఎక్కువ అమౌంటు కి బుక్ చేసుకున్నాడట . ఈ క్రమంలోనే పరుశురాం – అల్లు అరవింద్ కి చెప్పకుండానే గీతాగోవిందం 2 పై అఫీషియల్ ప్రకటన చేసేసాడు . ఈ క్రమంలోనే మండిపోయిన అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి అడిగి కడిగి పారేయాలి అనుకున్నారట. అయితే గిల్ట్ పెద్దలు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి రిక్వెస్ట్ చేయడంతో ఈ గొడవను ఇంతటితో ఆపేశారు . దీంతో ప్రజెంట్ అల్లు అరవింద్ – పరుశురాం పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు గీతాగోవిందం 1 తో కంపేర్ చేస్తే గీతగోవిందం 2 తో మరింత ఎక్కువ లాభాలు అందుకోవచ్చని అల్లు అరవింద్ ఆశలు పెట్టుకొని ఉన్నాడని.. అవన్నీ బోల్తా కొట్టడంతోనే ఇంత సీరియస్ అయ్యాడని తెలుస్తుంది ..ఏది ఏమైనా సరే పరుశురాం – అల్లు అరవింద్ ని నిలువునా ముంచేశాడు అన్నది మాత్రం వాస్తవం..!!