కేవలం 72 గంటల్లోనే రూ.100 కోట్లు సంపాదించిన విజయ్ సినిమా.. తెలుగులో మాత్రం!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వారిసు’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తెలుగులో తప్ప ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈరోజు అంటే జనవరి 14న ఈ మూవీ విడుదల కాగా పెద్దగా దీనికి రెస్పాన్స్ రాలేదు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్టర్‌గా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో ఏమో కానీ తమిళంలో మాత్రం బాగా హిట్ అయింది. ఎంతలా అంటే ఈ సినిమా 72 గంటలు అంటే రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా కాస్త ముందుగానే రిలీజ్ కావలసి ఉంది. కానీ సంక్రాంతికి డైరెక్ట్ తెలుగు సినిమాలు ముందుగా రిలీజ్ కావాలనే ఉద్దేశంతో దిల్ రాజు దీనిని కాస్త లేటుగా రిలీజ్ చేశాడు. నిజానికి థియేటర్ల సమస్య కూడా వారసుడు సినిమాకి ఎదురైంది. ఐతే మరీ లేటుగా కాకుండా వారసుడు సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల అది వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి అనే భారీ సినిమాలతో పోటీ పడాల్సి వస్తోంది.

వారిసు మూవీ బడ్జెట్ 280 కోట్లు కాగా ఆ డబ్బులు ఫస్ట్ వీక్‌లోనే వసూలు అయ్యేట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో ఈ సినిమాని ప్రేక్షకులు బాగా చూసేస్తున్నారు. అందుకే ఈ సినిమా కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతూ మూడు రోజుల్లోనే రూ.100 క్రోర్ క్లబ్‌లో చేరిపోయింది. దీనితో ఈ కొత్త ఏడాదిలో తమిళ్ ఇండస్ట్రీలో 100 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది. మరి తెలుగులో ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.