రాజమౌళి జగత్ కంత్రి..ఈ హిట్ సీను అక్కడ నుంచి కాపీ కొట్టాడా..!?

తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి అనే చెప్పాలి.. ఆయన తెరకెక్కించిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని తీసుకువెళ్లి.. ఈ సినిమాలుకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నాడు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు సాంగ్’ ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది.

ఇప్పుడు ఇది ఇలా ఉంటే రాజమౌళి తన కెరియర్ మొదటిలో తెరకెక్కించిన సినిమాలలో ఆయనకు బాగా ఇష్టమైన సినిమా విక్రమార్కుడు అని పలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించాడు. ఇందులో రవితేజ క్యారెక్టర్ కామెడీ అండ్ సీరియస్ గా రెండు షేడ్స్ లో చూపించి బ్లాక్ బస్టర్ హిట్‌గా మలిచాడు. ఈ సినిమా తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ హీట్ అవ్వగా.. తర్వాత అనేక భాషలో ఈ సినిమాను రీమేక్ చేయగా ప్రతి భాషలోని ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే చాలా సందర్భాల్లో రాజమౌళి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ సినిమాలోని ఓ సీన్ గురించి ఒక వార్త తెగ వైరల్ గా మారుతుంది.

Vikramarkudu - Disney+ Hotstar

ఆ సీన్ ఏమిటంటేఈ సినిమాలో రౌడీ కొడుకుకి పిచ్చి ఉందని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నైట్ పార్టీ చేసుకుంటుంటే దానికి మినిస్టర్ కూడా వస్తాడు మినిస్టర్ కి సెక్యూరిటీ గా విక్రమ్ రాథోడ్ (రవితేజ) వస్తాడు
అయితే ఆ రౌడీ కొడుకు పోలీస్ వాళ్ళతో ఒక ఆట ఆడుతాడు అదే ఆట హీరో వరకు వస్తుంది అది నచ్చని హీరో తన దగరికి రౌడీ పరుగెత్తుకుంటూ వస్తుంటే కింద బుల్లెట్స్ విసిరేసాడు వాటిమీద కాలు వేసిన రౌడీ స్లీప్ అయి కిందపడి చనిపోతాడు.

 Rajamouli Copied Vikramarkudu Scene From Vijayashanti Sambhavi Ips Movie Details-TeluguStop.com

అయితే ఈ సన్నివేశం పైనే చాలా సంవత్సరాలుగ చర్చ కూడా నడిచింది. రాజమౌళి ఈ సన్నివేశాన్ని విజయశాంతి ప్రధాని పాత్రలో నటించిన శాంభవి ఐపీఎస్ సినిమా నుంచి కాపీ చేశాడు అని చాలామంది రాజమౌళి పై విమర్శలు చేశారు. ఈ విషయంపై రాజమౌళి ఎన్నోసార్లు వివరణ కూడా ఇచ్చారు. అదేమిటంటే విజయశాంతి చేసిన సంభవి ఐపీఎస్ సినిమాకు స్టోరీ రిటైర్‌గా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పనిచేశాడని. ఆ టైంలో ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేక పోయిందని.. రాజమౌళికి మాత్రం ఈ సినిమాలోని ఒక సన్నివేశం అంటే చాలా ఇష్టంగా ఉండేది.

Telugu Anushka, Rajamouli, Raviteja, Sambhavi Ips, Vijayashanti, Vikramarkudu-Mo

అయితే రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాలో అనుకోకుండా అలాంటి సన్నివేశానికి స్కోప్ ఉండటం వల్ల సేమ్ అదే సన్నివేశాన్ని ఈ సినిమాలో చిత్రీకరించినట్టు చెప్పాడు. ఆ సన్నివేశాన్ని ఈ సినిమాలో చిత్రీకరించడం కోసం శాంభవి సినిమాను తెర‌కెక్కించిన డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మరి రాజమౌళి విక్రమార్కుడు సినిమా కోసం ఆ సన్నివేశాన్ని వాడుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పటికి కూడా రాజమౌళి పై నెగిటివ్ కామెంట్ చేస్తూనే ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నాడు.