పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. గత సంవత్సరం పవన్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు.
ఇక ఈ సినిమానే కాకుండా పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు.. ఇక వాటిలో స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ మూవీ కూడా ఒకటి ఉంది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో గ్రాండ్గా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నట్ల హరీష్ శంకర్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రకటించాడు.
ఇక ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని 2024 సంక్రాంతి కనుకాగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అంత అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా వచ్చేే సంక్రాంతికి ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే వచ్చే సంక్రాంతి టార్గెట్ చేసుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,శంకర్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బాబాయ్, అబ్బాయి లో ఎవరి సినిమా ముందు వస్తుందో చూడాలి.