ఎన్టీఆర్ 30వ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ఇదే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత‌ నటిస్తున్న తన 30వ సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. దాదాపు సంవత్సరం కాలం పాటు అభిమానులను ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. న్యూ ఇయర్ కానుకగా అధికార ప్రకటన కూడా ఇచ్చేశారు.

త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుకున్నాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అంతా భావిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఆచార్య ముందు ఆచార్య‌ కు తర్వాత అనే విధంగా తన కెరీర్ మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. మొదటి సన్నివేశం ఎలా చేయబోతున్నారనేది అందరి దృష్టిలో ఎంతో ఆసక్తిగా మారింది.

NTR 30 To Get More Delay
NTR 30 To Get More Delay

టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులో వేస్తున్న ప్రత్యేక సెట్‌ లో ఎన్టీఆర్ పై కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సన్నివేశాలకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయట. మొదటి షెడ్యూల్‌ కూడా దాదాపు రెండు వారాలపాటు నిర్వహించాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే అనుకున్న సన్నివేశాలను ముందుగానే కంప్లీట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. తర్వాత జరిగే రెండో షెడ్యూల్‌లో ఈ సినిమాలోని హీరోయిన్‌ను కూడా రంగంలోకి దించే అవకాశం ఉంది. మొత్తానికి ఇన్ని రోజులు వెయిట్ చేయించిన ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ భారీ ఎత్తున చిత్రీకరణ జరపబోతున్నారు. ఈ సంవత్సరం చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్- కొరటాల ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.