ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి కొరటాల , ఎన్టీఆర్ కన్నింగ్ డిసిషన్.. ఏమిటంటే..?

ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ నిన్న న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక దీంతోపాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్‌ను కూడా వచ్చే నెల ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నామని కొరటాల ప్రకటించాడు.

ఇక అయితే ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఇప్పటివరకు ఎన్నో వార్తలు వచ్చాయి. ఎందరో ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి ఇప్పటివరకు ఏ హీరోయిన్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ ఆలియా భట్ నుంచి అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ వరకు ఎన్టీఆర్ కు జంటగా నటిస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరో బాలీవుడ్ అందాల భామ దీపికా పడుకోణె కూడా ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్‌గా సెట్ అయ్యిందంటూ తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

NTR 31: Deepika Padukone and Jr NTR in Prashanth Neel directorial? |  Bollywood Bubble

దీపికా కూడా ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు సౌత్ సినిమాలంటే బాగా ఇష్టమంట అందుకే తాను కూడా మరిన్ని సౌత్ సినిమాలు చేయాలనుకుంటున్నట్లు దీపికా పదుడుకోణె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీపికా అన్న మాటలు బట్టి చూస్తే ఎన్టీఆర్ సినిమాల హీరోయిన్‌గా సెట్ అయిందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ కు సంబంధించిన అప్డేట్ ని కూడా ఇవ్వనున్నారని తెలుస్తుంది.

Share post:

Latest