2022లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మలు వీరే..!

మరికొన్ని గంటల్లో 2022వ సంవత్సరం పూర్తి కాబోతుంది. 2023వ సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అందరూ ఎంతో సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2022లో జరిగిన పలు సంఘటనలను అందరూ నెమర వేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఇక 2022లో మన తెలుగు చిత్ర పరిశ్రమంలో కూడా ఎన్నో వింతలు జరిగాయి.. వివాదాలు జరిగాయి.. విషాదాలు జరిగాయి.ఈ క్రమంలోనే ఈ సంవత్సరం చిత్ర పరిశ్రమలో నలుగురు హీరోయిన్స్ మాత్రం ఎక్కువగా హాట్ టాపిక్ గా మారారు. 2022 హీరోయిన్ ఆఫ్ ద ఇయర్ అనే లిస్టులో ఈ నలుగురు ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ నలుగురు ఎవరంటే.

రష్మిక మందన్న, పూజా హెగ్డే, శ్రీలీల, మృణాల్ ఠాకూర్. ఈ నలుగురు ముద్దుగుమ్మల పేర్లు ఈ సంవత్సరం ఎంతో బాగా వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే వరుస డిజాస్టర్లు అందుకున్న సమయంలో ఈమె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీటితోపాటు ఈమెపై నెగటివ్ కామెంట్స్ కూడా తో మరింత సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. ఎంతోమంది ఎన్ని కామెంట్స్ చేసినా ఈమెకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. వచ్చే కొత్త సంవత్సరంలో కూడా ఈమెకు ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు.

Sassy Actress Rashmika Mandanna Slays The Blue Ethnic Outfit With Floral Shrug | IWMBuzz

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న‌ కూడా ఈ సంవత్సరం బాగానే హైలెట్ అయింది. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా వరుస‌ అవకాశాలు అందుకుంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తన పుట్టినిల్లు అయిన కన్నడ ఇండస్ట్రీలో కూడా పెద్ద వివాదాన్ని సృష్టించింది రష్మిక.. ఈ వివాదంతో సోషల్ మీడియాలో కూడా ఇప్పటికీ హైలెట్ అవుతూనే ఉంది రష్మిక.

Actress Sreeleela looks cool in this latest pictures-శ్రీలీల బ్యూటిఫుల్ ఇమేజస్ | - Sreeleela Pics, Sreeleelacute, Sreeleela Hot

మరో ముద్దుగుమ్మ శ్రీ లీల పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది. తాజాగా రవితేజ కు జంటగా నటించిన ధమాకా సినిమాతో అదిరిపోయే హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌ స్టేటస్ ని దక్కించుకుంది. ప్రస్తుతం అరడజను సినిమాలతో తెలుగులో బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది.

Telugu Mrunal Thakur, Pooja Hegde, Pushpa, Sitaramam, Sree Leela, Tollywood Top-

సీతారామం సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే క్లాసికల్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో సీతగా ప్రేక్షకులు మదిలో చెరగని ముద్ర వేసుకుంది. ట్రెడిషనల్ లుక్ తో అందరినీ కట్టిపడేసింది. పై ముగ్గురు కంటే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుని 2022వ సంవత్సరానికి గాను హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా మృణాల్ నిలిచిపోయింది.

Share post:

Latest