కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన బాలయ్య – ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ గత రాత్రి 9:00 నుంచి స్ట్రీమింగ్ మొదలైంది . ప్రోమోలతోనే ఓవర్ హైప్ క్రియేట్ చేసిన ఆహా ..ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి ..పార్ట్ వన్ – పార్ట్ 2 అంటూ రెండు సార్లు స్ట్రీమింగ్ చేయబోతుంది. మొదటి పార్ట్ కు సంబంధించిన స్ట్రీమింగ్గత రాత్రి నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది . ఈ క్రమంలోనే ఒకేసారి చాలామంది యూజర్స్ ఆహాలో లాగిన్ అవ్వడంతో ఒక్కసారిగా ఆహా సైట్ క్రాష్ అయ్యింది.
రెబల్ ఫ్యాన్స్ దెబ్బకి ఆహా కొన్ని గంటలపాటు ఆగిపోయింది . అయితే ఎట్టకేలకు సరైన సమయంలో స్పందించి ప్రభాస్ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ షురూ చేసింది ఆహా. ప్రోమో కే సోషల్ మీడియాని షేక్ చేసిన ప్రభాస్ ..ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో జనాలు ఊహకు అందని విధంగా తయారయింది. కాగా ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వగానే ప్రభాస్ అభిమానులు కేవలం 12 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ ఇచ్చి సెన్సేషనల్ రికార్డు నెలకొల్పారు. రానున్న రోజుల్లో ఈ ఎపిసోడ్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో ఊహకందని పరిస్థితి నెలకొంది.
ఇక్ ఎపిసోడ్ విషయానికి వస్తే ప్రభాస్ తనదైన స్టైల్ లో బాలయ్యను ఆటాడేసుకున్నాడు . జనరల్ గా షోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బాలయ్య ఆటపటిస్తూ ..అలరిస్తూ..నవ్విస్తూ.. సరదాగా పర్సనల్ విషయాలు అడుగుతూ బుక్ చేసేవాడు . అయితే ప్రభాస్ విషయంలో మాత్రం బాలయ్య పప్పులు ఉడకలేదని చెప్పాలి . బాలయ్య అటుతిప్పి ఇటు తిప్పి ప్రభాస్ పెళ్లి గురించి ఎన్ని ప్రశ్నలు వేసిన సరే ప్రభాస్ పట్టు వదలని విక్రమార్కుడిలో ఒకటే ఆన్సర్ ఇస్తూ తప్పించుకున్నాడు.
” నాకు పెళ్లి రాసి పెట్టలేదు సార్.. నేను రొమాన్స్ చేయలేదు సార్.. అందుకే నాకు పెళ్లి కాలేదు సార్” అంటూ పెళ్లి పై నెగిటివ్ గానే స్పందించాడు కానీ.. ఎక్కడ పాజిటివ్గా రియాక్ట్ అయిన దాఖలాలు లేవు . అంతేకాదు బాలయ్య ఎన్నిసార్లు అడిగినా కానీ ప్రభాస్ పెళ్లి పై స్పందించకపోవడంతో ప్రభాస్ పక్కాగా ప్రిపేర్ అయ్యి షో కి వచ్చాడని.. ఈ క్రమంలోనే మహామహుల చేత అసలు విషయాన్నీ కక్కించిన బాలయ్య ప్రభాస్ పెళ్లి విషయంలో బోల్తా కొట్టాడని సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ సీజన్ కి హైలైట్ గా మారింది. త్వరలోనే ఎపిసోడ్ 2 స్ట్రీమింగ్ కానుంది..!!