సంక్రాంతి వార్: ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కాయో తెలుసా.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు ఐదు సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ ఐదు సినిమాల్లో ప్రేక్షకులు ముందుకు వస్తున్న వాటిలో క్రేజ్ మాత్రం మూడు సినిమాలకే ఉందన్న సంగ‌తి తెలిసిందే. వీర సింహారెడ్డి, వారసుడు, వాల్తేరు వీరయ్య సినిమాలపై ప్రేక్షకుల‌లో ప్రత్యేక దృష్టి ఉంది.

Pongal 2023 / Sankaranti release slot gets crowded! Tamil Movie, Music  Reviews and News

ఇప్పుడు ఈ సినిమాలు ఎన్ని థియేటర్లు విడుదలవుతున్నాయి అన్న‌ విషయానికొస్తే ముందుగా వాల్తేరు వీరయ్య 570 స్క్రీన్ లో విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. అ తర్వాత వీర సింహారెడ్డి సినిమాను 400 స్క్రీన్ లో రిలీజ్ చేస్తున్నారని సమాచారం. వారసుడు విషయానికొస్తే 250 స్క్రీన్ లో మరియు మరో కోలీవుడ్ హీరో అజిత్ నటించిన తునివు సినిమాను 50 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిగతా థియేటర్లకు సంబంధించిన లెక్కలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇప్పటివరకు వచ్చిన థియేటర్ల లెక్కల విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాలు విడుదలైన తర్వాత వాటికి వచ్చే టాక్ ను బట్టి మిగిలిన థియేటర్ల కేటాయింపులో ప్రాధాన్యత మారే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు కూడా వస్తున్నాయి.

వారసుడు సినిమాను తక్కువ థియేటర్లోనే దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారని అయితే దిల్ రాజు ప్రేక్షకులలో క్రేజ్ ఎక్కువ ఉన్న థియేటర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తుంది. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు స్ట్రెయిట్ సినిమాలు ఓకే సమయంలో ప్రేక్షకులం ముందుకు రావడంతో ఈ సంక్రాంతికి సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆ సినిమాల్లో ఏ సినిమాకు హిట్ టాక్ వస్తుందో అంటూ అభిమానుల మధ్య చర్చ జరుగుతుంది.

Thalapathy Vijay 's Varisu first single on this Diwali. | Flash Morning

ఇక ఆ విడుదలయ్యే సినిమాలను అభిమానుల అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో పాటు కొత్త రికార్డును క్రియేట్ చేయాలని ఆ హీరోల అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సంక్రాంతి విడుదలవుతున్న సినిమాల బడ్జెట్ దాదాపు 800 కోట్ల రూపాయలుగా ఉంటుందని సమాచారం. ఇంత బడ్జెట్ తో విడుదలవుతున్న సినిమాలన్నీ మొత్తం మీద 1000 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టాలని అభిమానులు భావిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ పాస్టర్ హిట్ సినిమాగా నిలుస్తుందో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

Share post:

Latest