నేషనల్ క్రష్ రష్మికను గత కొద్ది రోజుల నుంచి ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా `కాంతర` సినిమా విషయంలో రష్మికను ఎక్కేస్తున్నారు. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ కాంతార సినిమా గురించి మీ అభిప్రాయం చెప్పమని ప్రశ్నించగా.. రష్మిక తను సినిమా చూడలేదని స్పష్టం చేసింది. దాంతో రష్మికకు తలనొప్పి మొదలైంది.
కన్నడ సంస్కృతిని తెలియ చెప్పిన సినిమాను ఇంకా చూడలేదా అంటూ రష్మిక పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కన్నడ పరిశ్రమ రష్మికను బ్యాన్ చేస్తుందని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ట్రోలర్లకు రష్మిక దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. అలాగే కాంతార సినిమా వివాదం పై క్లారిటీ ఇచ్చింది. `కాంతార రిలీజ్ అయిన రెండు రోజులకే ఆ సినిమా గురించి అడగడంతో చూడలేదు కాబట్టి సరిగ్గా స్పందించలేదు.
ఆ తర్వాత చూసి చిత్ర బృందానికి మెసేజ్ చేశాను. వారు థాంక్యూ అని కూడా రిప్లై ఇచ్చారు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను అయినా నా వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి అనవసరం. వృత్తి పరమైన విషయాల గురించి చెప్పడమే నా బాధ్యత. నాపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. కన్నడ సినిమాలపై ఎప్పటికి నాకు ప్రేమ ఉంటుంది. కన్నడ పరిశ్రమ నన్ను బ్యాన్ చేశారని ప్రచారం జరుగుతుంది. అది పూర్తిగా ఆ వాస్తవం` అని రష్మిక వెల్లడించింది.