లోక నాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో ప్రస్తుతం `భారతీయుడు 2` సినిమా తెరకెక్కతోన్న సంగతి తెలిసిందే. కమల్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన `భారతీయుడు` సినిమాకు సీక్వల్ ఇది. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సినిమాకు పలు కారణాల వల్ల వరస బ్రేకులు పడుతూనే ఉన్నాయి.
ఎట్టకేలకు ఈ మూవీని ఇటీవల రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్.. కమల్‌హాసన్ పనితీరుపై షాకింగ్ సీక్రెట్స్ ను రివిల్ చేసింది. `భారతీయుడు 2లో కమల్ హాసన్ 90 ఏండ్ల వృద్ధుడి పాత్రను పోషిస్తున్నారు. ఉదయం 5 గంటలకే ఆయన సెట్ లోకి అడుగుపెడతారు.
వృద్ధుడి గెటప్ కోసం 5 గంటలు మేకప్ వేసుకుంటారు. దాన్ని తొలగించేందుకు మరో రెండు గంటలు పడుతుంది. ఉదయం పది గంటలకు కెమెరా ముందు రెడీగా ఉంటారు. చెన్నైలో ఉండే వేడి, ఉక్కపోతలో ఐదు గంటలు కేటాయించి క్యారెక్టర్ కోసం సిద్ధం అవ్వడం అంత సులువు కాదు. నటనకు ఇంతగా అంకితమయ్యే మరొకరిని చూడలేదు.` అంటూ రకుల్ కమల్ పై ప్రశంసలు కురిపించింది.