టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక బ్రాండ్ ఉంది. అలాగే ఈమధ్య ఐకాన్ స్టార్ గా మారారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్ మొత్తానికి మొదలయ్యింది. చెప్పాలంటే ఈ షూటింగ్ రెండు నెలల క్రితమే మొదలు కావాల్సి ఉంది. కానీ పుష్ప సినిమాని రష్యా భాషలో విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ మొత్తం అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా సినిమా రెగ్యులర్ షూటింగ్ని మొదలుపెట్టారు.
అయితే ఇక్కడ పుష్ప-2 సినిమా టీజర్ కోసమే ప్రత్యేకంగా షూటింగ్ మొదలు పెట్టడం పెద్ద విశేషం. సాధారణంగా ఒక సినిమా మొదలుపెట్టిన తరువాతే అందులోని కొన్ని మెయిన్ మెయిన్ రోల్స్ తీసుకొని టీజర్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. కాని పుష్ప -2 కు మాత్రం ప్రత్యేకంగా టీజర్ కోసమే ఒక షూటింగ్ తీయటమే ట్రెండ్.. అందుకోసమే సుకుమార్ కూడా అదే ఫాలో అయ్యి మైత్రి మూవీ మేకర్స్ ఊహించిన విధంగా టీజర్ కే దాదాపు రూ3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం టీజర్ కోసమే ఇంత ఖర్చు చేశారంటే ..సినిమా కోసం ఏ రేంజ్ లో బడ్జెట్ కేటాయించారో చెప్పాల్సిన పనిలేదు. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందనే ఆలోచనతోనే చిత్ర బంధం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ టీజర్ ని అవతార్ 2 సినిమా రిలీజ్ సమయంలో ఈ టీజర్ ని థియేటర్లలో విడుదల చేస్తారని టాక్ వినిపించింది. కానీ షూట్ ఆలస్యం కావడం వల్ల..విడుదల అయ్యే అవకాశం లేదనే టాక్ కూడావినిపిస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయాలని ఆలోచిస్తోంది చిత్రబృందం. మరి అలాంటి కాస్ట్లీ టీజర్ ప్రేక్షక, అభిమానులను ఈ టీజర్ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి.