పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పవన్ ఇలా రెండు పడవల ప్రయాణం చేయడం చాలా మందికి నచ్చడం లేదు. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఎందుకని కొందరు విమర్శలు సైతం గుప్పేస్తున్నారు.
అయితే తాజాగా పవన్ ఈ విషయంపై మాట్లాడుతూ డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా అని ఓపెన్ కామెంట్స్ చేశారు. డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నానని.. దేశం కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నానని పవన్ పేర్కొన్నారు. సినిమాలు చేయడం ద్వారా వచ్చిన డబ్బుతోనే పార్టీని నడుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఒకరిచ్చే ఫండింగ్ తో పార్టీని నడపడం తనకు ఇష్టం లేదని, అందుకే నచ్చిన పని చేసుకుంటూ పార్టీ కోసం డబ్బు సంపాదిస్తున్నానని పవన్ వెల్లడించారు. దీంతో ఈయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్ `హరి హరి వీరమల్లు` ను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఇది కాకుండాభవదీయుడు భగత్ సింగ్, వినోదయ సీతం రీమేక్ తో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీని ప్రకటించాడు.