ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ ప్రాజెక్ట్ `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.
ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా `పుష్ప ది రూల్` పేరుతో పార్ట్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తొలిభాగానికి మించి రెండో భాగాన్ని రూపొందించాలని సుకుమార్ భావిస్తున్నారు.
ఎక్కడ రాజీ పడకుండా షూటింగ్ ను పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే బన్నీ ఈ మూవీ షూటింగ్ కు డెడ్ లైన్ ఫిక్స్ చేశాడట. ఆగస్టు లోపు షూటింగ్ ను కంప్లీట్ గా ఫినిష్ చేయాలని బన్నీ చెప్పేశాడట. అందుకు సుకుమార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ అనంతరం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను షురూ చేయనున్నారని తెలుస్తోంది.