మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `భోళా శంకర్` ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయినా `వేదాళం` చిత్రానికి రీమేక్ ఇది.
ఇందులో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ఎంపికైంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ను కంప్లీట్ చేసిందని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు పుకార్లే అని తేలిపోయింది. ఎందుకంటే, ఈ మూవీ షూటింగ్ ఇంత వరకు ప్రారంభమే కాలేదు.
తాజాగా తమన్నా `భోళా శంకర్` గురించి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని బయట పెట్టింది. భోళా శంకర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదని.. జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుందని తమన్నా పేర్కొంది. ఇక ఈమె అప్డేట్ తో భోళా శంకర్ పూర్తి అవడానికి చాలా సమయం పడుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. కాగా, తమన్నా త్వరలోనే `గుర్తుందా శీతాకాలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇందులో సత్యదేవ్ హీరోగా నటించాడు. డిసెంబర్ 9న ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.