నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతిగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 ఎవరు ఊహించని రీతిలో మొదటి సీజన్ కంటే భారీ వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో గా అవతరించబోతుంది. ఇప్పటికే మొదటి ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ అవ్వగా ఆరో ఎపిసోడ్ నుంచి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండబోతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుందా ? అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
రీసెంట్‌గా ఆరో ఎపిసోడ్ కు సంబంధించిన చిన్న ప్రోమో గ్లిమ్స్ కూడా విడుదల చేశారు. ఆ ప్రోమోలో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ తో చేసిన రచ్చ మామూలుగా లేదు. అయితే ఈ ఎపిసోడ్ మాత్రం ఈ సంవత్సరం ఎండింగ్ డిసెంబర్ 31వ తేదీన న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ తర్వాత కూడా రాబోయే ఎపిసోడ్‌లో మరో క్రేజీ హీరో బాలయ్య షోకు రాబోతున్నట్టు ఆహా టీమ్ స్పష్టం చేసింది. ఆ స్టార్ హీరో మరి ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
చాలాకాలం నుంచి పవన్ కళ్యాణ్ ఈ టాక్ షో చివరి ఎపిసోడ్‌కు రాబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ వార్తలు నిజం చేస్తూ ఆహా టీమ్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూపులు చూస్తూనే ఉంది. వారి ఎదురుచూపులకు పవన్ కళ్యాణ్ బాలయ్య టాక్ షోకు వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్వరలోనే కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ కూడా మొదలుకానుందని ఆహా టీమ్ స్పష్టం చేసింది.
అయితే ఈ ఎపిసోడ్ ను మాత్రం సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అయితే బాలయ్య షో కి పవన్ కళ్యాణ్ రావడం కన్ఫామ్ కావడంతో అక్కడ బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అంటూ రచ్చ మొదలైంది. బాలయ్య పవన్‌ను ఇంట్రస్టింగ్ ప్రశ్నలతో ఇరికించబోతున్నాడట. ఇక ఈ షో కి పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన చిరకాల మిత్రుడు త్రివిక్రమ్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ షో తో పవన్ కళ్యాణ్- బాలకృష్ణ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడు చూడాలి.