“విడాకుల వార్తల పై నా వైఫ్ రియాక్షన్ ఇదే”.. నిఖిల్ కన్నా భార్యే బెటర్ గా ఉందే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరో నిఖిల్ కు ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ జూనియర్ రవితేజ గా పేరు సంపాదించుకున్నాడు . యాక్టింగ్ పరంగా.. కథలు చూస్సింగ్ పరంగా ..అచ్చం రవితేజ లానే ప్రొసీడ్ అవుతున్నారని.. ఆయనకు జూనియర్ రవితేజ అంటూ ట్యాగ్ చేశారు. ఈ క్రమంలోనే హిట్లు ఫ్లాప్ లు అని తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్న నిఖిల్ రీసెంట్గా కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా ప్రజెంట్ నిఖిల్ హీరోగా, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా 18 పేజెస్ . పలనాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 23 డిసెంబర్ 2022 గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నిఖిల్ తన నెక్స్ట్ సినిమా అప్డేట్స్ గురించి తనపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ గురించి స్పందించాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరో నిఖిల్ విడాకులు తీసుకుబోతున్నాడు అంటూ పలు వెబ్ సైట్స్ లో, మీడియా ఛానల్స్ లో వార్తలు వినిపించాయి .ఈ క్రమంలోనే అలాంటి రూమర్స్ పై గట్టిగా కౌంటర్ ఇచ్చాడు .

ఆయన మాట్లాడుతూ..” ఇలాంటి ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ రాసే వాళ్ళు ఎలా రాస్తారో నాకు అర్థం కావట్లేదు. నేను నా వైఫ్ పల్లవి వర్మ చాలా హ్యాపీగా ఉన్నాం. మా మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా మూవ్ అవుతుంది సోషల్ మీడియాలో కొన్ని మీమ్‌స్ ఇలాంటి ఫేక్ న్యూస్ చూసినప్పుడు నవ్వుకుంటాం.. కానీ విడాకుల విషయం పదేపదే ట్రోల్ అవుతూ ఉండడంతో నేనే ఒక ఫోటో పెట్టి విడాకుల వార్తలకు బ్రేక్ వేద్దాం అనుకున్నాను. అయితే అప్పుడు నా భార్య పల్లవి వర్మ చెప్పిన మాటలకు షాక్ అయ్యాను . ఏం మాట్లాడుతున్నావ్ డూడ్ ..మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు కదా ..పక్క వాళ్ళతో మనకెందుకు “అంటూ బోల్డ్ గా స్పందించింది.


“ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వాళ్ళు నిజా నిజాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది ..మరి ముఖ్యంగా యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ ఒక విధంగా పెట్టి ..లోపల కంటెంట్ వేరే విధంగా పెడుతున్నారు. అది మరీ దారుణం .. సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే మీమ్స్ కొన్నిసార్లు సరదాగా అనిపిస్తుంది . నేను నా భార్య అవి చూసి నవ్వుకుంటాం” అంటూ చెప్పుకొచ్చాడు . ఏది ఏమైనా సరే చూడముచ్చటగా ఉన్న ఈ భార్యాభర్తల మధ్య విడాకులు అంటూ వార్తలు పుట్టించి వీళ్ళ బంధాన్ని మరింత బలపరిచారు కొందరు గాసిప్ రాయళ్లు అంటూ నిఖిల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.