నాని కెరియర్నే మలుపు తిప్పిన చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోస్ వీళ్లే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎక్కువగా కామెడీ సినిమాలను విడుదల చేస్తు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఫ్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్య నిర్మాతగా కూడా నాని పలు చిత్రాలను తెరకెక్కిస్తే బిజీగా ఉన్నారు. నాని కెరీర్ ని మలుపు తిప్పిన భలే భలే మగాడివోయ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ చిత్రంతో నాని ఒక్కసారిగా మలుపు తిరిగారు. ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోల గురించి తెలుసుకుందాం.

Bhale Bhale Magadivoy - Disney+ Hotstar

నాని మొదట అష్టా చమ్మా చిత్రంతో తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో నటించగా మంచి పాపులారిటీ ఇక తర్వాత అంతటి క్రేజ్ అందించిన సినిమా ఏమిటంటే..డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నాని హీరోగా , లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన చిత్రం భలే భలే మగాడివోయ్. ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నాని కెరీర్ ని మరొకసారి నిలబెట్టిందని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమాని డైరెక్టర్ మారుతీ నాని కంటే ముందు ముగ్గురు హీరోలకు కథ వినిపించారట. ఆ ముగ్గురు హీరోలు ఈ సినిమా కథని రిజెక్ట్ చేయడంతో వెంటనే నాని ఈ సినిమాని ఒప్పుకోవడం జరిగిందట. అయితే ఆ ముగ్గురు హీరోలు ఎవరో అనే విషయం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ హీరోలు ఎవరంటే మొదట హీరో నాగచైతన్య మరొక హీరో అల్లరి నరేష్ మరొక నటుడు సునీల్ ఈ ముగ్గురు ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాలో నాని నటించే అవకాశం లభించింది. దీంతో నాని ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్నారు.