వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తారని చెప్పి నందమూరి తారకరత్న తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న తారకరత్న..తాజాగా ఎన్టీఆర్ ప్రచారం చేసే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో జూనియర్ టీడీపీ కోసం ప్రచారం చేస్తారని చెప్పారు.
అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేసిన ఎన్టీఆర్..ఆ తర్వాత టీడీపీ వైపు చూడలేదు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత..పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలని డిమాండ్లు వచ్చాయి. కానీ చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా టీడీపీని గాడిలో పెట్టి బలోపేతం చేసి..ఇప్పుడు రేసులోకి తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెద్దగా వినబడటం లేదు. కానీ తాజాగా తారకరత్న మాత్రం..ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారని చెబుతున్నారు. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అంటున్నారు.
టీడీపీ తరుపున పోటీకి దిగుతానని తారకరత్న అంటున్నారు..ఈ మేరకు తాజాగా ప్రకటన కూడా చేశారు. అయితే తారకరత్న ఈ ప్రకటన చేయడంతో..ఏ సీటు లో పోటీ చేస్తారనే చర్చ టీడీపీలో నడుస్తోంది. అయితే పోటీ చేయడానికి సీట్లు ఉన్నాయి..కానీ చంద్రబాబు సీటు ఇస్తారా? లేదా అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే గుడివాడ లేదా గన్నవరంలో నందమూరి ఫ్యామిలీ పోటీ చేస్తుందని ప్రచారం ఉంది.
గుడివాడ కాకపోయినా..గన్నవరంలో ఛాన్స్ ఉంటుంది. అటు గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి సీట్లలో ఛాన్స్ ఉంది. అలా కాకుండా రాయలసీమలోకి వెళితే అక్కడ కూడా కొన్ని సీట్లు ఉన్నాయి. కాకపోతే హిందూపురంలో బాలయ్య ఉన్నారు కాబట్టి..సీమలో సీటు ఇస్తారో లేదో క్లారిటీ లేదు. మరి చంద్రబాబు..తారకరత్నకు సీటు ఇస్తారా? ఇస్తే ఏ సీటు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.