అదే జరిగితే సినిమాలు ఆపేస్తా.. కీర్తి సురేష్ సంచలన కామెంట్స్..!

మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇక తర్వాత వరుస‌ పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ఆ సినిమా తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ సినిమాలు గా మిగిలిపోయాయి. ఇక తాజాగా మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కీర్తి వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ రీసెంట్‌గా క్యాస్టింగ్ కౌచ్ గురించి మరియు కమిట్మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Keerthy Suresh Spills The Beans On Her 6 Most Preferred Beauty Secrets,  Take A Look | IWMBuzz

ప్రస్తుతం ఉన్న సినిమా పరిశ్రమంలో ఏ ఒక్క హీరోయిన్ అయినా ఏదో ఒక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న వారే అనే అభిప్రాయం ఉంది. కాని కీర్తి సురేష్ మాత్రం తన కెరియర్ లో ఎప్పుడూ ఇలాంటి కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కోలేదు అంది. నన్ను ఎప్పుడూ ఏ ఒక్కరు కమిట్మెంట్ అడగలేదని కూడా కీర్తి సురేష్ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆమె ఈ విషయంపై మాట్లాడుతూ ‘మన ప్రవర్తన బాగుంటే అవతలి వారి ప్రవర్తన కూడా మనకు నచ్చుతుంది. అంటే అమ్మాయిలు కాస్త ఆ విధంగా కనిపించినా కూడా అవతలి వారు కాస్టింగ్ కౌచ్ కు పాల్పడే అవకాశం ఉంది అంటూ అంతేకాకుండా కమిట్మెంట్ అడిగే అవకాశం కూడా ఉంది అంటూ ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది’. ‘నాకు మాత్రం అలాంటి సమస్య వస్తే నేను సినిమాలు వదిలేసి ఏదైనా మంచి జాబ్ చేసుకుంటాను అంటూ కీర్తి సురేష్ వ్యాఖ్యానించింది’.

Keerthy Suresh Casting Couch : మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన  కీర్తి సురేష్.. అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్స్

‘నన్ను కమిట్మెంట్ ఎవరూ ఎప్పుడు అడగలేదు’.. ‘నేను అలాంటి టైప్ కాదని అందరికీ తెలుసు. అందుకే ఏ ఒక్కరో కూడా నాతో అలా ప్రవర్తించేందుకు సాహసం చేయరు అనే విధంగా కీర్తి సురేష్ తన మాటల్లో పేర్కొంది’. ప్రస్తుతం కీర్తి సురేష్ అన్న మాటలను చాలామంది తప్పుపడుతున్నారు. కీర్తి సురేష్ తన వ్యాఖ్యలు అమ్మాయిలదే తప్పు అన్నట్టుగా వ్యాఖ్యలు చేసింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ వ్యాఖ్యలపై కీర్తి సురేష్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.