ప్రస్తుతం సినిమా పరిశ్రమంలో విడాకులు తీసుకోవడం అనేది చాలా కామన్ గా మారిపోయింది. టాప్ సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు పెళ్లి అయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరో జంట విడాకులకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. నితిన్ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇది రియల్ లైఫ్ లో అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే అదేనండి నితిన్ తన చేయబోయే కొత్త సినిమాలో భార్యకు విడాకులు ఇచ్చిన భర్తగా నటించబోతున్నాడట.
ఇక ఆ సినిమాను నితిన్ కు భీష్మ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుని కొద్దిరోజులనే షూటింగ్ కూడా మొదలుపెట్టిన ఉన్నారు. ఈ సినిమాతో పాటు నితిన్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో డైరెక్టర్ గా మారిన వక్కంతం వంశీ తో కూడా సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్‌గా మొదలైంది.
ఈ రెండు సినిమాలు కన్నా ముందు నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ ఈ రెండు సినిమాలతో ఎలా అయినా సక్సెస్ అందుకోవాలని కసిగా ఉన్నాడు. నితిన్ ఈ సినిమాలతో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.