వారి వల్లే వడ్డే నవీన్ కెరీర్ నాశనమైందా… సంచలన నిజాలు ఇవే…

ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ గురించి ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఈ హీరో ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఫ్యామిలీ హీరోగా కొంతకాలం వరకూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ‘కోరుకున్న ప్రియుడు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత పెళ్లి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హైట్ చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ గత కొంతకాలం గా ఇండస్ట్రీ కీ దూరంగా ఉంటున్నాడు వడ్డే నవీన్.

ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి నవీన్ నటించే సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దాంతో నవీన్ తో సినిమా తీయడానికి దర్శక నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా వడ్డే నవీన్‌కి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ కొంతమంది మాత్రం సీనియర్ ఎన్టీఆర్ కుటుంబమే నవీన్ కి అవకాశాలు రాకుండా చేసిందని అంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు కుమార్తె ని వడ్డే నవీన్ వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత కొద్ది రోజులకే వారిద్దరి మధ్య విబేధాలు రావడం తో విడాకులు తీసుకున్నారు.

దాంతో సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం నవీన్ పై కక్ష కట్టి అవకాశాలు రాకుండా చేసి అతని ఇండస్ట్రీకి దూరంగా చేసారనే వార్తలు అప్పుడు వచ్చాయి. కానీ ఈ విషయం నిజామా కదా అనేదు మాత్రం ఎవరికి తెలీదు. మరి వడ్డే నవీన్ ఇప్పటికైనా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. హీరోగా కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్ట్ రోల్స్ లో నటించడానికి వడ్డే నవీన్ రియల్ ఇవ్వచ్చు. ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా క్లారిటీ లేదు.