ఆ టైంలో ఎన్టీఆర్ న‌రకం చూశాడా… అస‌లేం జ‌రిగింది…!

ప్రతి ఒక్కరి జీవితంలో గుడ్ టైం బ్యాక్ టైమ్ రెండు నడుస్తూనే ఉంటాయి. బ్యాడ్ టైం నడుస్తున్న రోజుల్లో మనం ఏ పని చేసినా అది వర్కౌట్ అవ్వదు.. అది ఎంత మంచి పనైనా అందులో ఎంతో కొంత లోపం ఉంటుంది. ఇదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో కూడా 2009వ సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు బ్యాడ్ టైమే నడిచింది. ఈ ఆరు సంవత్సరాల లో ఎన్టీఆర్ కెరియర్ పరంగా తన పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

Jr NTR Upcoming Movies 2022 & 2023 with Release Date, Budget, Trailer &  More - JanBharat Times

2009 ఎలక్షన్ లో ఎన్టీఆర్ టీడీపీ తరుపున ఎన్నికలో ప్రచారంలో పాల్గొని ప్రచారం చివరి దశలో ఉండక యాక్సిడెంట్ కు గురైన విషయం మనకు తెలిసిందే.. ఆ సమయంలో ఎన్టీఆర్ డాన్స్ చేయకూడదు ఇంకా వాటికి దూరంగా ఉండాలనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎన్టీఆర్ ఆ మాటలను పట్టించుకోకుండా తన మీద నమ్మకంతో సినిమాల మీద ఉన్న ఇష్టంతో డాన్స్ ను వదిలిపెట్టలేదు. ఇదే క్రమంలో 2009 ఎలక్షన్లో టీడీపీ ఘోరమైన పరాజయం పాలయింది.

ఇందులో ఎన్టీఆర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కూడా దారుణమైన ఫలితాలు రావడంతో ఆ టైంలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలు ఎన్టీఆర్ ను మరింత బాధించాయి. ఆ తర్వాత సంవత్సరం ఎన్టీఆర్ అదుర్స్- బృందావనం వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న అవి ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గ సక్సెస్ రాలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ కు చంద్రబాబుకు మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

ఎన్టీఆర్ పెళ్లి విషయంలో కూడా ఎన్నో తప్పుడు వార్తలు కూడా వచ్చాయి. 2011లో ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణీతల వివాహం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. అదే సంవత్సరం ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా విడుదలై తన కెరియర్ లోనే ఘోరమైన డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఊసరవెల్లి సినిమా ఫలితం కూడా ఎన్టీఆర్‌కు నిరాశే మిగిల్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము సినిమాకు ముందుగా పాజిటివ్ టాక్ వచ్చినా తర్వాత ఆ సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో ఆ సినిమా కూడా ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది.

RRR' Actor, Jr NTR's Wife, Lakshmi Pranathi Styles Her Chic Look With A  Sling Bag Worth

ఆ సినిమాల‌ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన రామయ్య వస్తావయ్య, రభస సినిమాలతో మళ్లీ అపజ‌యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తరవాత 2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ విజయ పరంపర ఈ సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా సూపర్ క్రేజీ తెచ్చుకున్నాడు.

ఇప్పటివరకు తన మీద వచ్చిన విమర్శలు అన్నిటికీ సమాధానాలు చెబుతూ తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి భారతదేశంలో ఉన్న అగ్ర దర్శకులు అందరూ క్యూ కడుతున్నారు. ఎంత ఎదిగిన‌ ఒదిగి ఉంటున్న తారక్ మరిన్ని విజయాలను సొంతం చేసుకుని కెరీర్ లో ఎంతో ఎదగాలని ఆయ‌న అభీమ‌నులు కోరుకుంటున్నారు.