మన తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎందరో గొప్ప నటిమణులు ఉన్నారు. అంతమంది ఉన్న మనం వారిలో సావిత్రిని మాత్రమే మహానటిగా చెప్పుకుంటాం. సావిత్రి తన నటనతో ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలరు. ఒక కంటిలో కన్నీరు, మరో కంటిలో నవరసాలు పండించగల గొప్ప నటి. సావిత్రి ముందుగా తన కెరియర్‌ను నాటకారంగంలో మొదలుపెట్టి.. తరువాత తన కుటుంబ సహకారంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.
చిత్ర పరిశ్రమలో కూడా మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న సావిత్రి వాటన్నింటినీ విజయాలకు మెట్లుగా మలుచుకుని తనని తాను నిరూపించుకుంది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకి మహారాణి లాగా మారింది. అంతలా తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది సావిత్రి. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు వంటి అగ్ర కథానాయకులు సావిత్రితో నటించాలంటే వారు తమ సినిమాల్లో డైలాగులను ఒకటికి రెండుసార్లు చదువుకునేవారట.
వారు అంతలా జాగ్రత్త పట్టడానికి సావిత్రి నటన ముందు మా నటన తేలిపోతుందనే భయంతో వారి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారట. ఈ విషయం బట్టి సావిత్రి ఎంత గొప్ప నటో మనం అర్థం చేసుకోవచ్చు. సావిత్రి తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో కోట్ల ఆస్తులను కూడా సంపాదించింది. ఇక సావిత్రి తన సంపాదించిన ఆస్తులను తనకోసం వాడుకోకుండా ఎప్పుడు ఇతరులకు పేదవారికి సాయం చేయడం కోసమే ఉపయోగిస్తూ ఉంది. అందుకే ఇప్పటీకి కూడా మనం సావిత్రి అని తలుచుకోకుండా ఉండలేం.
ఇకపోతే ఆ రోజులో కంచి నుంచి గోల్డ్ జరీ చీరలు నేసే వారు వచ్చేవారట. ఆ చీర విలువ అప్పట్లోనే రూ.25 వేలు ఉండేది..అలింటి చీరలను సూర్యకాంతమ్మ , కన్నాంబ తర్వాత అంతటి ఖరీదైన చీరలను కట్టింది కేవలం సావిత్రి మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఆమె రేంజ్ ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత గొప్పగా బతికిన సావిత్రి చివరి రోజుల్లో తినడానికి కూడా తిండి లేకుండా.. చూసుకునేవారు లేక కోమాలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.