ఒక్క సినిమాలే కాకుండా వ్యాపారంలో కూడా దండిగా సంపాదిస్తున్న హీరోయిన్లు వీరే!

ఇండియాలో మిగతా సినిమా పరిశ్రమలకీ, తెలుగు సినిమా పరిశ్రమకే ఓ తేడా వుంది. అదే రెమ్యునరేషన్. అవును, మనవాళ్ళు హీరోయిన్లకు దండిగా రెమ్యునరేషన్ ఇవ్వడంలో మంచి దిట్టలు. అందుకే పర భాషా నటీమణులు ఇక్కడ ఎక్కువగా వెలుగొందుతారు. ఒక్కసారి ఇక్కడ క్లిక్ అయిన తరువాత ఇంకెక్కడికీ పోరు. ఎందుకంటే ఇంతకు మించి వారికి డబ్బులు ఇంకెక్కడా ఇవ్వరు కాబట్టి? అలా ఇక్కడకు వచ్చి క్లిక్ అయినవారు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాలు కూడా ఓ పక్క చేస్తూ వుంటారు.

ఈ క్రమంలో చాలా మంది హీరోయిన్స్ వ్యాపారాలతో చాలా ఎక్కువ డబ్బును ఇక్కడ సంపాదిస్తున్నారు. అందులో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. సినిమాలతో పాటు ఫిట్నెస్ రంగంలో కూడా రాణిస్తోంది. ముంబై, హైదరాబాద్ లాంటి సిటీలలో ఫిట్నెస్ స్టూడియోలు రకుల్ కి ఉన్నాయి.

ఆ తరువాత తమన్నా గురించి చెప్పుకోవచ్చు. ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క జ్యువెలరీ డిజైనర్ వ్యాపారం చేస్తుంది తమన్నా భాటియా. ఇక సమంత గురించి చెప్పనవసరం లేదు. స‌ఖి పేరుతో గార్మెంట్ బ్రాండ్ ను ప్రారంభించి… లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్ వేర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తన ఇమేజ్ ని వ్యాపార రంగంలో కూడా సాధించింది సమంత. ఆ తరువాత కాజల్ అగర్వాల్ గురించి చెప్పుకోవాలి. తన భర్త గౌతమ్ కిచ్లు తో కలిసి ఫర్నిచర్ బిజినెస్ ను ప్రారంభించింది. అంతే కాకుండా అత్తారింటికి దారేది సినిమా బ్యూటీ ప్రణీత కూడా బెంగళూరులో ఓ స్టార్ హోటల్ ను ప్రారంభించి… హోటల్ రంగంలో విజయవంతంగా రాణిస్తోంది.