మెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వాల్తేరు వీరయ్య వచ్చేస్తున్నాడు..!

మెగాస్టార్ చిరంజీవిని చూసిన.. ఆయన నటించిన ఐకానిక్ మాస్ సినిమాలో చూసిన.. పక్క పర్ఫెక్ట్ మాస్ హీరో ఎలా ఉండాలో ఈజీగా అర్థమవుతుంది. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమంలో మాస్ హీరోలకే గాడ్ ఫాదర్గా నిలిచారు చిరంజీవి. అయితే ఈ క్రమంలోనే గత కొంతకాలంగా చిరంజీవి సీరియస్ సినిమాలు చేస్తూ మాస్ ఫాన్స్ కు కొంత దూరమయ్యాడు.

వాల్తేరు వీరయ్య: నిజంగానే అలాంటి పని చేసిన చిరు..బాబీని బూతులు తిడుతున్న మెగా ఫ్యాన్స్..!! - Telugu Lives

ఇప్పుడు మాస్ అభిమానులకు అదిరిపోయే రేంజ్ లో పక్కా మాస్ సినిమాతో ముఠామేస్త్రి సినిమా గెటప్ లో చిరు నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్‌ అభిమానులను ఎంతగానో ఆకర్షించాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ రానుందని తెలుస్తుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు.

Telugu films releasing for Sankranti 2023 - The South First

ఈ సినిమాతో విడుదలయ్యే సినిమాల విడుదల తేదీలను ఇప్పటికే ఆ సినిమాల చిత్ర యూనిట్ ప్రకటించాయి. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు సాయంత్రం 4.05 నిమిషాలకు రివిల్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాతో చిరంజీవి ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Share post:

Latest