ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 55వేల స్క్రీన్ లలో అవతార్ 2 గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మనదేశంలోనే అన్ని భాషల్లో కలిపి దాదాపు 4500 స్క్రీన్ లలో ఈ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు మోగించేసింది. అవతార్ 2 గతంలో ఏ సినిమాకు లేనంతగా ఈ సినిమాకు బుకింగ్స్ జరిగాయి.
ఈ క్రమంలోనే మన దేశంలో కే జి ఎఫ్ రికార్డ్ ను అవుతార్ బ్రేక్ చేసేసింది. దీంతో ఓపెనింగ్ కలెక్షన్స్ పై కూడా భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. మన దేశంలో తొలిరోజు అవతార్ 2 వసూళ్లు ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 40 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అవతార్2 సినిమా కోసం ఐదు లక్షలకు పైగా అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్నారు భారతీయులు. మన దేశ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకు ఎంతమంది అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకోలేదు.
ఇప్పటివరకు ఈ రికార్డు కేజీఎఫ్ 2పేరు మీద ఉంది కేజీఎఫ్ 2 చూసేందుకు ఇండియన్ సినిమా ప్రేక్షకులు 4 లక్షల టికెట్లు బుక్ చేసుకున్నారు. అలాగే బ్రహ్మాస్రకు 3 లక్షల 2000, దృశ్యం 2 సినిమాకు 1,16,000, త్రిబుల్ ఆర్ సినిమాకు 1,50,000 టికెట్లు అడ్వాన్స్ గా బుక్ అయ్యాయి. అవతార్ 2 సినిమా ఆంధ్రప్రదేశ్- తెలంగాణలో 850 పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఆంధ్ర, తెలంగాణలో అడ్వాన్సులు భారీ ఎత్తున బుకింగ్ అయ్యాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో మల్టీప్లెక్స్ అన్నీ దాదాపు హౌస్‌ఫుల్ అయ్యాయి, వివరాల్గా చూస్తే తొలి ముడు రోజుల్లోనే అవతార్2 మనదేశంలో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు 16,500 కోట్ల రూపాయలు వసూళ్లు రావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరాన్ స్వయంగా ప్రకటించారు. మరి అవతార్2 ఎలాంటి సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.